Type to search

టాలీవుడ్ లో పీరియాడిక్ చిత్రాల చరిత్ర..

Box Office News

టాలీవుడ్ లో పీరియాడిక్ చిత్రాల చరిత్ర..

Sye raa narasimha reddy, sye raa, Raatnam, bahubali, old movies, old telugu movies, period movies, period movies in telugu, telugu period movies, telugu periodic movies, fictional period movies in telugu, historic period movies in telugu, gauthami putra satakarni, magadheera, vangaveeti, raktha charitra, rani rudramadevi, rudrama devi,ఇప్పుడు తెలుగు సినీ అభిమానులంతా ‘సైరా ‘ తో ఫిదా అయిపోయారు. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నారు. హిస్టారిక్ మూవీ ,పీరియాడిక్ మూవీ అంటే యూత్ చూడరనే మాటను అబద్దం చేసింది’ సైరా ‘ .అసలు ఈ హిస్టారికల్ మూవీల చరిత్రేంటో కాస్త చూద్దాం ..
పిరియాడిక్ సినిమా అంటే ఒక నిర్దేశిత సమయంలో జరిగిన కథను తిరిగి వెండి తెరపై ఆవిష్కరించడం. 70 80 దశకం లో జానపద చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కాంతారావు ఈ చిత్రాలలో ఎక్కువగా నటించారు. రాజులు పరిపాలించిన కాలం నాటి కథలను జనరంజకంగా సినిమా లో చూపించేవారు. ఇవే కాక రామాయణం, మహాభారతం లోని ముఖ్య ఘట్టాలను కూడా సినిమాలు గా తీశారు. ఆ క్రమాన్ని పరిశీలిస్తే మొదట భక్తుల గురించి, వేదాంతుల గురించిన కథలతో సినిమాలు వచ్చాయి. చిత్తూరు నాగయ్య గారు వేమన అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 1947 లో విడుదలైంది. ఆయనే నటించిన త్యాగయ్య సినిమా 1946 లో విడుదలైంది మరియు భక్త పోతన సినిమా కూడా 1942లో విడుదలైంది. అలనాడు విడుదలైన చారిత్రక చిత్రాలుగా వీటిని చెప్పుకోవచ్చు
ఆ తర్వాత సినిమా కథలు రాజుల వైపు మళ్ళాయి. వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజుల పరిపాలనా కాలం నాటి కథలుగా కొన్ని సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఎన్టీఆర్ గారు మరియు భానుమతి గారు నటించిన మల్లీశ్వరి సినిమా ఈ కోవకు చెందిందే. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా 1951లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిలోని మధురమైన పాటలు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. అక్బర్ కాలం నాటి కథగా అనార్కలి సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా 1955లో విడుదలైంది. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా చాణక్యచంద్రగుప్త అనే సినిమా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత క్రమంగా పీరియాడిక్ సినిమాల నిర్మాణం తగ్గిపోయింది. వీటిని నిర్మించడం మామూలు విషయం కాదు. ఆ కాలానికి సంబంధించిన భారీ సెట్ లను నిర్మించాలి. అందులో నటించే నటుల మేకప్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆ కాలానికి తగినట్టుగానే వారి హావభావాలు, భాష ఉండాలి. ఈ సినిమాలు నిర్మించడానికి భారీ బడ్జెట్ అవసరమయ్యేది. దీనితో మామూలు సాంఘిక చిత్రాల నిర్మాణం ఎక్కువగా జరగడం ప్రారంభమైంది. దాదాపు 30 సంవత్సరాలపాటు తెలుగులో ఏవో కొద్ది సినిమాలను మినహాయించి, పిరియాడిక్ సినిమా నిర్మాణం జరగలేదు.
ఆ తర్వాత 1997లో అన్నమయ్య చిత్రం రిలీజ్ అయింది. దీనిలో నాగార్జున, కస్తూరి, రమ్యకృష్ణ నటించారు. దీనికి రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనిలో సుమన్ కూడా నటించారు. ఆ తర్వాత 2006లో శ్రీరామదాసు సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో వచ్చింది. దీనిలో కూడా నాగార్జున హీరోగా నటించారు. ఆ తర్వాత క్రమంగా పిరియాడిక్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. దర్శకుడు రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో రాజన్న చిత్రం నిర్మించబడింది. ఈ చిత్రం రజాకార్ల కాలం నాటి కథతో రూపుదిద్దుకుంది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనిలో నాగార్జున నటించారు. తర్వాత తెరకెక్కించిన కొన్ని చిత్రాలను పరిశీలిస్తే, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా గురించి చెప్పుకోవాలి .దీనిలో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటించారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి అనే చిత్రాన్ని తెరకెకెక్కించారు. దీనిలో అనుష్క, రానా, అల్లు అర్జున్ నటించారు. రాణి రుద్రమదేవి యొక్క జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఘాజి చిత్రాన్ని తెరకెకెక్కించారు. దీనిలో రానా హీరోగా నటించారు. ఈ చిత్రం 2017 లో విడుదలైంది. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధ కాలం నాటి కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
రాయలసీమ ఫ్యాక్షన్ కథావస్తువుగా రక్త చరిత్ర అనే చిత్రం నిర్మించబడినది. దీనికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. 1990 లో రాయలసీమలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర రెండు కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షన్ యుద్ధమే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదైలైంది. మొదటి భాగంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా నటించారు. రెండవ భాగంలో సూర్య హీరోగా నటించారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ చరిత్రలో మరింత వెనక్కి వెళ్లి వంగవీటి అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా విజయవాడలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించక పోయినా, పెద్ద కాంట్రవర్సీలను మూటకట్టుకుంది. క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. హేమ మాలిని బాలకృష్ణ తల్లిగా నటించారు. శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇది శాతకర్ణి బయోపిక్ అని చెప్పవచ్చు. బాలకృష్ణ 100వ చిత్రంగా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఇటీవల కాలంలో రంగస్థలం అనే సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దీనిలో రామ్ చరణ్ మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 1980లలో జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . వినికిడి సామర్థ్యం లేని యువకునిగా రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పల్లెటూరి అమ్మాయి గా సమంత కూడా చక్కగా నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, ఆది ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఎనభైల నాటి పరిస్థితులను దర్శకుడు సుకుమార్ తెరపై చక్కగా ఆవిష్కరించారు.
ఇప్పుడు వచ్చిన సైరా చిత్రం ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గురించి అప్పటి ఉద్యమం గురించి పూర్తి గా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపెట్టి అలనాటి ఉద్యమ రోజులకు తీసుకెళ్లాడు దర్శకుడు.
ఇలా అప్పటినుండి ఇప్పటి వరకూ పీరియాడిక్ మూవీస్ ప్రేక్షకులను చరిత్రలోకి తీసుకెళుతూనే ఉన్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *