Type to search

రికార్డ్ స్థాయికి చేరుకున్న హెరిటేజ్ ఫుడ్స్ టర్నోవర్ – 80 లక్షల పెట్టుబడి ..2 వేల కోట్ల రాబడి..!

News

రికార్డ్ స్థాయికి చేరుకున్న హెరిటేజ్ ఫుడ్స్ టర్నోవర్ – 80 లక్షల పెట్టుబడి ..2 వేల కోట్ల రాబడి..!

chandra babu naidu, raatnam, heritage, hyderabad heritage, heritage income, Heritage Group, Heritage Group income, brahmani,nara lokeshభారత దేశ రాజకీయాలలో ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ గణనీయమైన ఆదాయాన్ని గడిస్తోంది. 2018 -2019 సవత్సరానికి గాను సదరు కంపెనీ టర్నోవర్ 2 వేల 482 కోట్లకు చేరుకుంది. దేశంలోని 15 రాష్ట్రాలకు విస్తరించింది. పాల తయారీ, ఉత్పత్తిలో ఇప్పటి వరకు 3 లక్షల మంది పాడి రైతులు హెరిటేజ్ లో భాగస్వామ్యులుగా వున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫండ్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వున్నారు. రాబోయే 2024 సంవత్సరం లోపు మరో మూడు లక్షల మంది రైతులను భాగస్వామ్యం చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకుంది కంపెనీ. అందులో భాగంగానే పాడి గేదెలు, ఆవులను రైతులకు అందజేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం తమ సంస్థతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఎంఓయూ చేసుకుంటోంది హెరిటేజ్ .

తాజాగా మూడు బ్యాంకులతో రైతులకు రుణాలు అందజేసేలా సంతకాలు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ లతో ప్రస్తుతానికి టై అప్ పెట్టుకుంది. తక్కువ వడ్డీకే రుణాలు రైతులకు ఈ బ్యాంకులు అందజేయనున్నాయి. ఈ పాడి రైతులు గేదెలు, ఆవుల ద్వారా వచ్చే పాలను హెరిటేజ్ కు అందజేస్తారు. వీరికి నెల నెలా హెరిటేజ్ బిల్లులు చెల్లిస్తుంది. అంతే కాకుండా వచ్చిన వాటిలోంచి రుణాల కిస్తులు బ్యాంకులకు చేరవేస్తుంది. దీని వల్ల వారికి ఉపాధి దక్కుతుంది. దీంతో వ్యాపారం కూడా విస్తరించేందుకు వీలవుతుంది. ఇప్పుడు దేశంలో అమూల్ తో పాటు ఎన్నో కంపెనీలు పాడి పరిశ్రమలో కొనసాగుతున్నాయి. వాటి సరసన హెరిటేజ్ ఫుడ్స్ చేరింది. ఇందులో వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ఇది ఇప్పుడు బిగ్గెస్ట్ కంపెనీగా మారింది. హెరిటేజ్ కంపెనీని మొదటగా 1992 లో చంద్రబాబు తన భార్య పురేందేశ్వరితో కలిసి ప్రారంభించారు. వీరిద్దరూ ఎగ్జిక్యుటివ్స్ గా ఉన్నారు ఈ కంపెనీలో.

ప్రొక్యూర్మెంట్ , ప్రాసెస్సింగ్, పాలు అమ్మడం చేస్తోంది హెరిటేజ్ ఫుడ్స్. 2011 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ , 2016 లో బ్యాంక్ ఆఫ్ బరోడా తో హెరిటేజ్ ఏం ఓ యూ చేసుకుంది. దీని వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది. చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ తో టై అప్ చేసుకుంది హెరిటేజ్. అలాగే మహారాష్ట్రలోని ఎస్బిఐ తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా రైతులకు పాడి రుణాలు అందుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతోనే బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తున్నాం. దీని వల్ల ఇటు రైతులకు మేలు జరుగుతుంది. మరో వైపు బ్యాంకులకు నెల నెలా అసలుతో పాటు వడ్డీ జమ అవుతుంది. పరస్పర సహకారం వల్ల ఇప్పటికే మహిళా సంఘాలు సాధికారతను సాధించాయి. అదే ప్రాసెస్ వీరికి వర్తిస్తుంది అంటారు చంద్ర బాబు. అయితే నారా బ్రాహ్మణి టేకోవర్ చేసుకున్నాక హెరిటేజ్ స్వరూపమే పూర్తిగా మార్చేశారు. మరింత కార్పొరేట్ లుక్ తీసుకు వచ్చారు. కంపెనీ ఆదాయం 2 వేల కోట్లకు పైగా చేరుకోవడం మాములు విషయం కాదు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *