Type to search

తెప్పరిల్లిన తెలంగాణ .. హరీష్ గట్టెక్కించేనా..?

News Politics

తెప్పరిల్లిన తెలంగాణ .. హరీష్ గట్టెక్కించేనా..?

telangana, raatanm, harish rao, trs, kcr, harish rao finance department, harish rao finance department, harish rao trouble shooter, trouble shooter, finance minister, recessionతెలంగాణ ఉద్యమ రథానికి ఆయన ఇరుసుగా ఉన్నారు. మామ కేసీఆర్ కు నమ్మిన బంటుగా, కష్ట కాలంలో అండగా ఉంటూనే తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వచ్చినా దానిని అధిగమించేలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో నెంబర్ టూ గా ఉన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు తెచ్చుకున్న హరీష్ రావు కు మరో పేరుంది అదే ట్రబుల్ షూటర్. పార్టీ మొదటి నుంచి ఉన్న హరీష్ రావు మొదటి సారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన నీటి పారుదల శాఖను చేపట్టారు. అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు ఏ పని అప్పగించినా దానిని విజయవంతం చేశారు. అదే సమయంలో రెండో సారి ఎన్నికల్లో అధికార పార్టీ మళ్ళీ పవర్ లోకి వచ్చింది.

కానీ కొలువుతీరిన కేబినెట్లో పార్టీ అధినేత, మామ కేసీఆర్ అల్లుడు తన్నీరు కు చోటు కల్పించలేదు. అదే సమయంలో కొడుకు కేటీఆర్ కు పార్టీ కార్యనిర్వాహక పదవిని కట్టబెట్టారు. దీనిపై పార్టీలో , బయట అల్లుడిని కావాలనే పక్కన పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని గమనించిన సీఎం హరీష్ కు కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో చోటిచ్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అల్లుడికి ఏరి కోరి ఆర్ధిక శాఖను అప్పగించారు సీఎం . ఈ శాఖను నిర్వహించడం అంటే కత్తి మీద సాము చేయడం లాంటింది. ఇప్పటికే బంగారు తెలంగాణ మాటేమిటో కానీ ఇప్పుడు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం . భారీ ఎత్తున అప్పులే మిగిలాయి. సాక్షాత్తు అసెంబ్లీ లో ఈ విషయాన్నీ సీఎం చెప్పారు..తెలంగాణాలో ఆర్ధిక పరిస్థితి బాగో లేదని తెలిపారు. దీనికి అంతా కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనంటూ ఆరోపణలు చేశారు.

ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఆటో రంగం పూర్తిగా దెబ్బతిన్నదని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. ఏరి కోరి ఆర్ధిక శాఖను అప్పచెప్పారు అల్లుడికి. ఇప్పటికే ఎంతో అనుభవం కలిగిన హరీష్ కు ఇవ్వడం వల్ల ఏమైనా మార్పులు జరుగుతాయా, ఎప్పటి లాగే ఉంటుందో చూడాలి. ట్రబుల్స్ లో ఉన్న తెలంగాణను ఏ మేరకు గట్టెక్కించ గలరోనని పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఆ మేరకు మంత్రి చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. దుబారా ఖర్చులు తగ్గించు కోవాలని ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. అంతటా మాంద్యం నెలకొన్నదని, అందుకే ప్రతి ఒక్కరు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎలాంటి కానుకలు ఉండవని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఇచ్చే విందును కూడా రద్దు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అసలు విషయాన్నీ కేంద్రం దాచి పెట్టిందని ఆరోపించారు. ఆర్ధిక మాంద్యం ఉన్నపటికీ ప్రాధాన్యతా, సంక్షేమ రంగాలకు నిధుల కొరత ఉండబోదన్నారు. మొత్తం మీద హరీష్ ఆర్ధిక శాఖకు జీవం పోస్తారా లేదో వేచి చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *