Type to search

హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్‌ స్టూడియోను ఏర్పాటు చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్

Box Office News Trenging News

హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్‌ స్టూడియోను ఏర్పాటు చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్

Gopi Sundar, Raatnam, Gopi Sundar movies, Gopi Sundar music director, Gopi Sundar sets up a new music studio, Gopi Sundar music studio, Gopi Sundar studio, Gopi Sundar studio in Hyderabadటాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్ హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్‌ స్టూడియోను ఏర్పాటు చేశాడు. కేరళకు చెందిన గోపీ సుందర్‌ సాంగ్‌ కంపోజింగ్ కోసం కొచ్చిలోని తన మ్యూజిక్‌ స్టూడియోకు వెళ్లాల్సి వస్తోంది. దర్శకనిర్మాతలతో మ్యూజిక్‌ సిట్టింగ్‌, పాటల రికార్డింగ్‌కు ఇబ్బందులు తలెత్తడంతో పాటు సమయం కూడా వృథా అవుతున్నట్లు భావించిన గోపీ సుందర్‌ హైదరాబాద్‌లోనే స్టూడియే ఏర్పాటు చేశాడు. ఇక ముందు చేయబోయే కొత్త చిత్రాల పాటలను ఇక్కడే కంపోజ్‌ చేయనున్నాడు గోపి సుందర్.
గోపి సుందర్ ఇప్పటికీ 115 చిత్రాలకు వివిఢ బాషలలో సంగీతం అందించారు. గత కొద్ది కాలంగా సినీ సంగీత ప్రియుల్ని తన క్రేజీ మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు గోపీ సుందర్‌. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..’ అంటూ సాగే సాంగ్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు మజ్ను, భలేభలే మగోడివోయ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న గోపీ సుందర్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, ఎంత మంచి వాడవురాతో పాటు ఇంకా పేరు ఖరారు కాని అఖిల్‌ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *