Type to search

యురేనియం కోసం సినీ జనం

Box Office News Top Stories

యురేనియం కోసం సినీ జనం

Uranium Mining, Effect Of Uranium Mining In Nallamala Forest, Uranium Mining In Nallamala, Nallamala Forest, tiger Reserve in Nallamala Forest, bjp, ycp, helpless nallamalla, eco system, ecology, environment, vijay deverakonda, pawan kalyan, pawan kalyan against Uranium Mining In Nallamala Forest, vijay deverakonda against Uranium Mining In Nallamala Forest, film celebrities against nallamala mining, samantha akkineni nallamalaప్రకృతి రమణీయతకు ఆలవాలంగా నిలుస్తూ, వేలాది మంది అడవి బిడ్డలకు నీడనిస్తూ , అపారమైన వనరులు కలిగిన నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే చెంచు పెంటల్లో , గిరిజనులు, చెంచులు, ఇతర సమూహమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యురేనియం వ్యతిరేక కమిటీగా ఏర్పడ్డారు. అన్ని పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, మహిళా నాయకురాలు భవాని రెడ్డిని నాగర్ కర్నూల్ లోనే అరెస్ట్ చేశారు. మరో వైపు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నల్లమలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. నల్లమల ఏపీ, తెలంగాణాలో విస్తరించి ఉన్నది. అపారమైన అటవీ ప్రాంతం, జీవరాసులు, టైగర్ ప్రాజెక్టు , ఔషదాలు, ఖనిజ నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నవి.

ఇక్కడ యురేనియం త్రవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా గతంలో కడపలో ఏర్పాటు చేసిన యురేనియం త్రవ్వకాలు తమకు వద్దంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ ప్రత్యేక కమిటీని నియమించారు. మరో వైపు యురేనియం తీయాలంటే పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. దాదాపు నాలుగు వేలకు వైగా బోర్లు వేయనున్నారు. దీని వల్ల జీవనదులైన తుంగభద్ర, కృష్ణా నదులు కలుషితమై పోతాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. ఓ వైపు హరితహారం అంటూ ఊదర గొడుతున్న సీఎం మొత్తం అడవి నాశనం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదంటూ అడవి బిడ్డలు నిలదీస్తున్నారు. ఇంతకు ముందు వజ్రాల వెలితీత కోసం డీబీర్స్ కంపెనీ నల్లమలలో అడుగు పెట్టింది. దీనిని పెద్ద ఎత్తున ప్రజలు అడ్డుకున్నారు. గత్యంతరం లేక డీబీర్స్ వెనక్కి తగ్గింది.

తాజాగా మరోసారి యురేనియం వెలికితీత కోసం పావులు కదపడంతో మట్టి బిడ్డలు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. నల్లమల వాసులకు అండగా సినిమా రంగానికి చెందిన నటులు, దర్శకులు తీవ్ర స్థాయిలో స్పందించారు. మొదటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల యురేనియం వద్దు అడవిని కాపాడుకుందాం అంటూ ముందుకు వచ్చారు. మిగతా వారు స్పందించాలని కోరారు. ఆమేరకు ఆయన మంత్రి కేటీఆర్ కు ట్వీట్ కూడా చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని హీరో విజయ దేవర కొండ, సమంత, యాంకర్ అనసూయ, డైరెక్టర్ నారాయణ మూర్తి లాంటి వాళ్లు ముందుకు వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు ఏకంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నును కలిసి యురేనియం కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే పవర్ స్టార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వీహెచ్ చైర్మన్ గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం మీద టీఆర్ ఎస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వత్తిడి పెరుగుతోంది. మహేష్ బాబు, జూనియ ఎన్ఠీఆర్ , బాలకృష్ణ, రవితేజ , రామ్ లాంటి వాళ్ళు ఇంకా స్పందించక పోవడంపై సినీ వర్గాలు విస్తు పోతున్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *