Type to search

‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై మండిపడుతున్న అభిమానులు

Box Office News Trenging News

‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై మండిపడుతున్న అభిమానులు

మాకు అవమానం జరిగింది- ‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై మండిపడుతున్న అభిమానులు Sarileru Neekevvaru, Mahesh Babu Sarileru Neekevvaru, Sarileru Neekevvaru teaser, Sarileru Neekevvaru trailer, sarileru neekevvaru trailer, sarileru neekevvaru movie songs, mahesh babu latest movie, mahesh babu, mahesh babu teaser, sarileru neekevvaru first look, Sarileru Neekevvaru movie teaser, Anil Ravipudi, Sarileru Neekevvaru latest look, Sarileru Neekevvaru latest poster, tamannaah, pooja hedge, rashmika mandanna, rathnavelu, devi sri Prasad, dsp, vijaya shanthi look from Sarileru Neekevvaru, vijayashanthi Sarileru Neekevvaru look, sarileru neekevvaru new poster, Sarileru Neekevvaru photoshoot, fans hurt at Sarileru Neekevvaru photoshoot, police at Sarileru Neekevvaru photoshoot
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్‌బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్‌లో మహేశ్‌తో ఫొటోలు దిగినట్టు సోషల్‌ మీడియాలో, ట్విటర్‌లో వస్తున్న అప్‌డేట్స్‌ను బట్టి తెలుస్తోంది.
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఆయనతో ఫోట్ దిగడానికి తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
మహేశ్‌తో ఫొటోషూట్‌ పేరిట ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు సమాచారం. సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై హీరో మహేశ్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్‌బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్‌ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్‌బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది.
బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్‌ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *