Type to search

ఈటల ప్రయోగించిన ఈటెలు ఎవరిపై..? తెలంగాణలో కలకలం..!

Latest News News Politics Telangana

ఈటల ప్రయోగించిన ఈటెలు ఎవరిపై..? తెలంగాణలో కలకలం..!

trs, telangana, raatnam, ts, telangana state, ts news, kcr, ts cm kcr, telangana news, telangana latest news, harish rao, etala rajendra, emotional speeches, latest political updates💥💥💥💥💥💥💥💥💥💥
👉జస్ట్, ఒక్కసారి… వెనక్కి… ఇంకాస్త వెనక్కి… తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో… ఎక్కడో ఓ గ్రామంలో కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ‘ఏం..? పదవి లేకపోతే ప్రజాసేవ చేయలేనా..? మిమ్మల్ని వదిలేస్తానా..? మీరు నాకు లేరా..?’ అని ఎమోషనల్ అయ్యాడు… 🗣
👉ఆరోజు నుంచీ ఈరోజుకూ హరీష్రావు పరిస్థితి టీఆర్ఎస్లో ఉండీలేనట్టు..! ఉన్నట్టే, కానీ ఏమీ లేనట్టు…! రేప్పొద్దున ఏమిటో తెలియనట్టు..! హరీష్ అడుగులు ఎటువైపో… తన స్థితి ఏమిటో ఏమీ అర్థం కానట్టు…
💥💥💥💥💥💥💥💥💥💥
👉బంగారు తెలంగాణ(BT) బ్యాచ్ అద్భుతంగా వెలిగిపోతున్న కాలంలో, నిజంగా తెలంగాణ కోసం ఉద్యమించిన బ్యాచ్ దురవస్థ ఏమిటీ అనే ఆలోచనలు స్టార్టయినట్టు…! సరే, ఒక్కసారి సీన్ కట్ చేయండి…👇
👉తాజాగా ఈటల… తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్… సభ లో మాట్లాడుతూ🗣 బరస్టయ్యాడు… ‘ఏం..? నేను ఏమైనా మంత్రి పదవి అడుక్కున్నానా..? బీసీ కోటాలో ఇవ్వాలని అడిగానా..? ఏళ్లుగా పోరాడిన బ్యాచ్ మేం… గులాబీ జెండాకు ఓనర్లం… మంత్రిపదవి నాకు భిక్ష కాదు…’’ అని ఎమోషనలయ్యాడు…
💥💥💥💥💥💥💥💥💥💥
👉తెలిసిందే కదా… అసలు తనకు మంత్రి పదవి కేసీయార్ ఇస్తాడనే నమ్మకమే లేదు అప్పట్లో… ఇప్పుడేమో ‘నువ్వు రెవిన్యూ వాళ్ల అంతు చూసే చట్టంపై ప్రభుత్వ ఆలోచనల్ని లీక్ చేస్తున్నావు, అందరినీ ఉసిగొల్పుతున్నావు… తిరుగుబాటు చేయిస్తున్నావు… ఇక నిన్ను సహించేది లేదు…’ అన్నట్టుగా కొన్ని స్పాన్సర్డ్ వార్తలు వచ్చాయి…

👉సీఎం కస్సుమంటున్నాడు, రాబోయే మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఊడిపోయేది ఈటల పదవే అన్నట్టుగా ఊహాగానాలు కొద్దిరోజులుగా ప్రచారంలోకి వచ్చాయి…
ఇప్పుడేమో ఈటల స్పందన ఇదీ…👇
💥💥💥💥💥💥💥💥💥💥
👉మొన్నమొన్నటిదాకా మీరెవరూ రియాక్ట్ కావద్దు అంటూ అప్పీల్ చేసిన తనే… ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలకు దిగాడు… కేసీయారా..? నన్ను తీసేస్తాడా..? సో వాట్..? అన్నట్టుగా అర్థం ధ్వనిస్తున్నది తన మాటల్లో…
💥💥💥💥💥💥💥💥💥💥
👉నిజానికి ఈటల చాలాకాలంగా టీఆర్ఎస్కు కీలకనేత… అందులో ఎవరికీ ఏ అనుమానమూ లేదు… అయితే టికెట్లు ఖరారు నుంచి, మంత్రి పదవి ఖరారు దాకా ఎప్పుడూ ఓ అనిశ్చితి… కేసీయార్కు ఎందుకో పడటం లేదు… అది ఆత్మగౌరవమా…? అది ఇక్కడ పనికిరాదు కదా… మరి..?

👉రాబోయే మంత్రివర్గ విస్తరణలో తన పోస్టు గల్లంతేనని ఈటలకు అర్థమైందా..? లేక టీఆర్ఎస్లో బంగారు తెలంగాణ, ప్లాటినం తెలంగాణ, యురేనియం తెలంగాణ బ్యాచుల తాకిడికి నిజమైన ఉద్యమ తెలంగాణ బ్యాచుకు స్థానం లేదా..? ఈటలకు క్లారిటీ వచ్చేసిందా..? ఏమిటో తెలియదు గానీ ఒక్కసారిగా బ్లాస్టయ్యాడు…

👉నిజంగానే ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం… బహుశా రేపు ఇక ఈటల మీద పింక్ మీడియా విరుచుకుపడొచ్చు… ఈటల చరిత్ర ఇదీ అన్నట్టుగా పుంఖానుపుంఖాలుగా కథనాలు కూడా రావొచ్చు… అయితే… ఒక హరీష్, ఒక ఈటల నిర్వేదంలో ఉన్నంతమాత్రాన టీఆర్ఎస్కు జరిగే నష్టం ఏముందీ అంటారా..?👇
💥💥💥💥💥💥💥💥💥💥
👉అసలే బీజేపీ కొండచిలువలాగా నోరు తెరిచి ఆవురావురుమంటున్నది… మూడు ఎమ్మెల్సీలు పోయాయి… నాలుగు ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకున్నది… మరో మూడు కాంగ్రెస్ గెలుచుకున్నది… ఈ స్థితిలో ఆల్ ఈజ్ వెల్ అనుకునే స్థితిలో టీఆర్ఎస్ లేదు… లేదు… అవునూ… నిజంగానే కేసీయార్ ఫోతేఫోవోయ్ అని ఈటలను వెళ్లగొడితే… తను ఏం చేయబోతున్నాడు..? విలువైన ప్రశ్న… ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న…❓🤔

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *