Type to search

ఎమిలీ బ్లేక్ కి గాంధీ కి నివాళులు

Gallery News Top Stories

ఎమిలీ బ్లేక్ కి గాంధీ కి నివాళులు

జోహనీస్బర్గ్ దక్షిణ ఆఫ్రికా— 1901 ఎప్రెల్ లో మొదలు కేప్టౌన్లో ప్లేగ్ రాగా..లండన్ కి టెలిగ్రాం చెయ్యగా ఎమిలి బ్లేక్ బ్రుందం మేలో చేరుకుంది..వివిద హాస్పటల్లో పనిచేసి 1904 కల్లా జోహనీస్బర్గ్ జెనెరల్ హాస్పటల్కి వచ్చింది బ్లేక్..1902 లో జోహనీస్బర్గ్కి ఏడు కిలోమీటర్ల దూరంలో రియట్ఫెంటెన్ లోని ఒక కుష్టు వ్యాధి కేంద్రాన్ని ..ప్లేగ్ కాంపుగ మార్చిన్రు..తెల్లోల్లకి ..మిగితా వాళ్లకి విడివిడిగ టెంట్లని ఎర్పాటు చేసిన్రు…చనిపోయిన ఎలుకలకి నుంచి పురుగులు మనుషులకు ఈ ప్లేగ్ వ్యాధి వ్యాపింప చేస్తయి .. అంటు వ్యాధి (1994 లో సూరత్ లో వచ్చింది మీకు గుర్తుండే ఉంటది)..అక్కడొకటి అక్కడొకటి ప్లేగ్ కేసులు వస్తుండే 1903 లో .. ఎట్ల చనిపోయిన్రో తెల్వక పాతిపెడుతుండే అక్కడున్న పేద భారతీయులు .. 150 ఎకరాల ఒక స్లం అది..గలీజ్గ ఉండే..అప్పటికే గాంధీ మున్సిపాలిటీ వాళ్లతో స్లం క్లీన్ చేసే విషయంలో యుద్ధమే చేస్తుండే..డబ్బులున్న భారతీయులు వేరే ప్రాంతంలో ఉంటుండే..రోజు రోజుకి వ్యవసాయ కూలీలు రావటం ఎక్కువకావటంతో పరిస్తితి ఇంకా దిగజారింది .. 1904 ఫెబ్రవరీలో గాంధీ మున్సిపాలిటీ వాళ్లని మళ్ళీ హెచ్చరించిండు..పలుమార్లు .ఇట్లనే ఉంటే పెద్ద ప్రమాదమే జరుగుతదని..మెడికల్ ఆఫెసర్ పొర్టర్ని తీసుకపోయి చూపిస్తే .. ఆ స్లమ్ని అక్కడనుంచి మార్చటం ఒక్కటే దిక్కు అని నివేదిక ఇచ్చిండు..మర్చ్ ఒకటికల్ల న్యుమోనియాతో మరణాలు పెరుగుతుండటంతో గాంధీ ఇది ప్లేగ్ అంటువ్యాధే అని చెప్పగా మెడికల్ ఆఫీసర్ కాదు అంటుండే..16 తారీఖున మెడికల్ ఆఫీసర్ మేయర్కి చెప్పిండు .. వీళ్ళని ఇక్కడినుండి కొంచెం కింది పక్కకి మార్చండి అని..కాని అక్కడ తెల్లోళ్ళు ఉన్నరు..వాళ్ళు ఒప్పుకొలే..
18 మర్చ్ కల్లా ప్లేగ్ మహమ్మారి ఆ ప్రాంతం అంత వచ్చింది..ఒక మనిషి చనిపోతే శవం తీయటానికి కూడా ఎవరు ముందుకు రాట్లే..వారిస్తున్నా గాంధీ అతని సహయకుడు మదంజీత్,డాక్టర్ గాడ్ఫ్రే సహయ కార్యక్రమం మొదలు పెట్టిన్రు .. ముగ్గురితో కష్టమైతే .. సాయంత్రం కల్లా ఇంకో నాలుగురిని తీసుకొచ్చిన్రు..తెల్లారి కల్లా 17 మంది చనిపోయిన్రు ..19న ప్రభుత్వం ప్రకటించింది సిటిలో ప్లేగ్ వచ్చిందని..20 పొద్దున కల్లా ఆ ప్రాంతాన్ని పోలిసులు బారికేడ్లు పెట్టిన్రు..అటు ఇటు ప్రజలు తిరగకుండ .. 19 నుండి 25 వరకు మొత్తం 55 మంది చనిపోయిన్రు .. పేషంట్లని ఫ్లేగ్ హాస్పటల్ కి తరలించిన్రు..పేషంట్లకి బ్రాండీ ఇస్తే ఉపశమనమని ఇస్తుండే.. నర్సు బ్లేక్ నేను తాగుతన్న మీరు తాగండని గాంధీకి చెప్పగ నిరాకరించిండు..పేషంట్లని చూస్తున్న డాక్టర్ మరైస్ 17వ తారీఖున ప్లేగ్తో చనిపోయిండు .. అతని భార్య 21న .. ముగ్గురు పిల్లలు కూడ…పిల్లల్లో ఒక బాబుని చూసి తట్టుకోలేక ముద్దడిన బ్లేక్ కి 22న సోకింది..27న చనిపోయింది..చనిపోయేనాటికి 27 ఏండ్లు …జులై 16న ప్లేగ్ కంట్రొల్ కి వచ్చింది అని ఎనౌన్స్ చేసేనాటికి 82 మంది చనిపోయిన్రు .. బ్లేక్ కి గాంధీ “మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్” పుస్తకంలో గుర్తుచేసుకొని నివాళులు అర్పించిండు … 1904 లోనే గాంధీది రెండవ జన్మ అని చెప్పుకోవచ్చు.. 1948లో గాడ్సే మన నుంచి కేవలం శరీరాన్ని దూరం చేసిండు…గాంధీ తాత .. మనందరికి ఎప్పటికి తాతే..ఎమిలీ బ్లేక్ కి గాంధీ కి నివాళులు — స్రవంత్ పోరెడ్డి

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *