Type to search

న్యూ బిజినెస్ లోకి ఎమ్మెస్ ఎంటర్

Latest News News Sports

న్యూ బిజినెస్ లోకి ఎమ్మెస్ ఎంటర్

instagram, cricket, india, dhoni, cricket team, rohit sharma, virat kohli, cricket team remunerations, remuneration, cricketer remuneration, virat kohli remuneration, ms dhoni into business, dhoni into business, cars 24, dhoni cars 24, gurugram, gurugram based cars 24

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని పెద్దలు చెప్పిన మాటల్ని నిజం చేస్తున్నారు మనం ఆరాధించే క్రికెటర్లు. పేరుకు దేశం కోసం ఆడుతున్నామని చెబుతున్నా కొందరు ఆటగాళ్లు మినహా అంతా మనీ మీదే ధ్యాస పెడుతున్నారు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ ఆదాయం కలిగిన క్రీడా సంస్థ ఏదైయినా ఉంది అంటే అది ఒక్క బీసీసీఐనే. ఇప్పటికే వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది ఈ సంస్థకు. భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ఇటీవల అమెరికా సంస్థ ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ఆదాయం గడించే భారతీయ ఆటగాళ్లలో టాప్ లో నిలిచారు. ఆయన ఆదాయం నెలకు వందల కోట్లను దాటింది. మరో వైపు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ గా పేరుంది.

వివిధ రంగాలలో , వ్యాపారాలలో భారీ ఎత్తున ప్రకటనల రూపేణా సంపాదిస్తూ వస్తున్నారు . ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళా ఉంటుందన్న వాస్తవాన్ని ఇండియన్ క్రికెటర్లు ఆచరణలో నిజం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు మిగతా అఆటగాళ్లు సైతం సరిలేరు మాకెవ్వరు అంటూ చేతినిండా నింపేసుకుంటున్నారు. ఎప్పుడు ఉంటామో ఇంకెప్పుడు ఉండమో తెలియని పరిస్థితుల్లో , వచ్చిన అవకాశాలను ఎందుకు వదిలేసి కోవాలని , ముందస్తుగానే ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు . వీరికి ఐపీఎల్ ఓ వరంలా దొరికింది . ఫ్యాషన్ , దుస్తులు, షూస్ , వాచెస్ , లాజిస్టిక్స్, తినే ప్రాడక్ట్స్ , ట్రావెలింగ్ , ఇలా ప్రతి రంగంలోనూ వీరే అగుపిస్తున్నారు. జస్ట్ అయిదు నిముషాలు లేదా ఐదు సెకన్లు నటిస్తే చాలు కంపెనీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి .

భారీ ఎత్తున వీరితో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఊహించని రీతిలో ఏడాదికి వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అనధికారిక అంచనా. భారత దేశంలో అతి పెద్ద క్రీడా జూదం ఏదంటే ఒక్క క్రికెట్ పేరే చెప్పు కోవాల్సి ఉంటుంది . తాజాగా ధోని మరో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. గురుగ్రామ్‌ కేంద్రంగా నడిచే కార్స్‌ 24 సంస్థలో పెట్టుబడి పెట్టాడు. తమ బ్రాండ్‌ విలువను పెంచుకొనేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయనతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్‌24 వెల్లడించింది. ఆ సంస్థలో ధోనీ కొంతమేర వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. ఐతే మహీ పెట్టుబడి విలువెంతో బహిర్గతం చేయలేదు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *