Type to search

డియ‌ర్ కామ్రేడ్‌ మూవీ రివ్యూ

Actors Actresses Box Office Movie Reviews News

డియ‌ర్ కామ్రేడ్‌ మూవీ రివ్యూ

లిల్లీ మనసును మాత్రమే దోచుకున్న ‘డియ‌ర్ కామ్రేడ్’

టైటిల్ : డియర్‌ కామ్రేడ్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్‌, సుహాస్‌
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
దర్శకత్వం : భరత్ కమ్మ
నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్‌, యష్‌ రంగినేని
సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ అంటేనే క్రేజ్ మాములుగా ఉండదు ‘అర్జున్‌రెడ్డి’తో తానేంటో ప్రూవ్ చేసుకుని , గీత గోవిందం తో వైలెన్స్ మాత్రమే కాదు సాఫ్ట్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు. ‘ లేటెస్ట్ గా డియ‌ర్ కామ్రేడ్’ లో అదే కాంబినేషన్ తో రావడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తెలుగుతో పాటు, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ విడుద‌లైంది. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతవరకూ అలరించిందో తెలుసుకోవాలంటే అసలు ఆ చిత్ర కథేంటో చూడాలి…Dear Comrade Theatrical Trailer, Dear Comrade, Dear Comrade Telugu Trailer, Dear Comrade Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Bharat Kamma, Justin Prabhakaran, Mythri Movie Makers, Dear Comrade official Trailer, Dear Comrade Telugu Movie, Vijay Devarakonda, Vijay Deverakonda New Movie Trailer, Vijay Deverakonda Movies, #DearComradeTrailer, Dear Comrade Song Promos, Dear Comrade Video Songs, 2019 Latest Telugu Movie Trailers, 2019 Telugu Movies, Dear Comrade pre release event, Dear Comrade review, Dear Comrade movie review, Dear Comrade movie review in telugu, Dear Comrade telugu review, Dear Comrade raatnam reviewకథ :
చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ అతనికి . ఆవేశం ఎక్కువ‌. త‌న చుట్టూ ఉన్నవారిలో ఎవ‌రికి స‌మస్య వ‌చ్చినా వెంట‌నే అక్కడ ఉంటాడు అందుకోసం ఎవ‌రితోనైనా గొడ‌వ‌కి దిగుతుంటాడు. ఆ నైజం కొన్నిసార్లు ఫ్యామిలీ లో కూడా చిక్కులు ఏర్పడుతాయి అలా సాగుతూన్న బాబీ లైఫ్ లోకి హైద‌రాబాద్ నుంచి త‌న ప‌క్కింటికి వ‌చ్చిన అప‌ర్ణాదేవి అలియాస్ లిల్లీ (ర‌ష్మిక మంద‌న‌) వస్తుంది. ఆమెను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. క్రికెట‌ర్ అయిన లిల్లీ కూడా బాబీని లవ్ చేస్తుంది. కానీ లిల్లీ కి కోపం అంటే నచ్చదు , ఎప్పుడూ ఆవేశం వ‌దులుకోమ‌ని బాబీని అడుగుతూంటుంది . కానీ బాబీ మార‌క‌పోవడంతో ఇద్దరి మ‌ధ్య దూరం పెరుగుతుంది.లిల్లీ దూరమవడం తో బాబీ తన కుటుంబాన్ని కూడా వదిలేసి మూడేళ్లు ఎక్కడెక్కడో తిరుగుతాడు.

అలా మూడేళ్లు గడిచిపోతాయి. త‌ర్వాత మ‌ళ్లీ లిల్లీ ని కలుస్తాడు.కానీ లిల్లీ మానసికంగా క్రుగింపోయి డిప్రెషన్ లో ఉంటుంది. ఆమె అలా అవడానికి కారణం ఆమెను క్రికెట్ లో కి ఎదగనీకుండా వేధిస్తున్నదెవరో తెలుసుకుంటాడు. ఇక లిల్లీకి ఎలా సహాయం చేస్తాడు ఆమెని మళ్ళీ .మూడేళ్ల త‌ర్వాత బాబీలో ఎలాంటి మార్పులు క‌నిపించాయి? లిల్లీలో బాబీ ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడు? అనే అంశాలను వెండితెరపై చూడాల్సిందే …Dear Comrade Theatrical Trailer, Dear Comrade, Dear Comrade Telugu Trailer, Dear Comrade Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Bharat Kamma, Justin Prabhakaran, Mythri Movie Makers, Dear Comrade official Trailer, Dear Comrade Telugu Movie, Vijay Devarakonda, Vijay Deverakonda New Movie Trailer, Vijay Deverakonda Movies, #DearComradeTrailer, Dear Comrade Song Promos, Dear Comrade Video Songs, 2019 Latest Telugu Movie Trailers, 2019 Telugu Movies, Dear Comrade pre release event, Dear Comrade review, Dear Comrade movie review, Dear Comrade movie review in telugu, Dear Comrade telugu review, Dear Comrade raatnam reviewవిశ్లేషణ . ఆవేశం ఎక్కువ ఉన్న అబ్బాయి , బాగా సున్నిత మనస్కురాలైన అమ్మాయి మధ్య జరిగే ప్రేమ ,సంఘర్షణ ల కథ ఇది.

ఓ లవ్ స్టోరీ కి , ఒక సామాజిక సందేశాన్ని కూడా కలిపి తీసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం స‌మాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన స‌మ‌స్యని కూడా ఇందులో చూపెట్టడం హర్షణీయం. ఇందులో లిల్లీ లా ప్రతి యువతీ కూడా ఒక కామ్రేడ్ ఉంటే బాగుణ్ణు అనుకునేవిధం గా తీర్చిదిద్దారు వారి పాత్రలను. విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఇమేజ్‌కి త‌గ్గట్టుగా ఆయ‌న పోషించిన బాబీ పాత్ర ఉంటుంది . విజయ్ లో ఆవేశాన్ని చూపెట్టడమే ధ్యేయంగా ఈ పాత్రను మలిచారా అని కూడా అనిపిస్తుంది చిత్రం మొదటి భాగం లో . చాలా సార్లు అర్జున్ రెడ్డి గుర్తు వస్తుంటాడు బాబీ పాత్రలో కూడా. కానీ బాబీ చేసే పోరాటాలేవి కూడా సినిమా కు యాప్ట్ గా అనిపించదు
.లిల్లీతో ప్రేమలో ప‌డే స‌న్నివేశాలు యూత్ కి కనెక్ట్ అవుతాయి కానీ వారిద్దరూ దూర‌మ‌వ‌డానికి గ‌ల కార‌ణాల్ని, అక్కడ పండాల్సిన భావోద్వేగాల్ని బ‌లంగా చూపించ‌లేక‌పోయారు.
ఇక అస‌లు క‌థ అంతా సెకెండ్ హాఫ్ కోసమే దాచుకున్నట్లు అంతా అక్కడే చెప్పేస్తాడు కానీ చాలా స్లో నేరేషన్ లో . మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల నేపధ్యాన్ని ఇందులో మేళ‌వించిన విధానం అందరినీ ఆలోపింపజేస్తుంది . ఇక లాస్ట్ అరగంట సినిమా చ‌క్కటి భావోద్వేగాల్ని పండించింది. స్టోరీ, పాత్రలతోపాటు…వాటిని స‌హ‌జంగా తెర‌పైకి తీసుకురావ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా… క‌థ‌నం విష‌యంలో ద‌ర్శకుడు కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది . దాంతో చాలా స‌న్నివేశాలు న‌త్తన‌డ‌క‌న సాగుతున్నట్లు అనిపిస్తాయి. ఇంకా ఉందా సినిమా అని కూడా అనిపిస్తుంది ప్రేక్షకుడికి. తరువాత జరిగే స్టోరీ కూడా తెల్సిపోతూంటుంది. కొత్తగా అనిపించదు .Dear Comrade Theatrical Trailer, Dear Comrade, Dear Comrade Telugu Trailer, Dear Comrade Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Bharat Kamma, Justin Prabhakaran, Mythri Movie Makers, Dear Comrade official Trailer, Dear Comrade Telugu Movie, Vijay Devarakonda, Vijay Deverakonda New Movie Trailer, Vijay Deverakonda Movies, #DearComradeTrailer, Dear Comrade Song Promos, Dear Comrade Video Songs, 2019 Latest Telugu Movie Trailers, 2019 Telugu Movies, Dear Comrade pre release event, Dear Comrade review, Dear Comrade movie review, Dear Comrade movie review in telugu, Dear Comrade telugu review, Dear Comrade raatnam reviewనటీనటులు ఎలా చేశారు ?
విజ‌య్ దేవ‌ర‌కొండ బాబీ పాత్రలో మంచి అభిన‌యం ప్రద‌ర్శించాడు. విద్యార్థి నాయ‌కుడిగా, ప్రేమికుడిగా ఆయ‌న పండించిన భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే బాబీ పాత్రపై ‘అర్జున్‌రెడ్డి’ ప్రభావం చాలానే క‌నిపిస్తుంది. దాదాపు చాలా స‌న్నివేశాల్లో సిగ‌రెట్‌ కాలుస్తూ క‌నిపించ‌డం, అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పడం ‘అర్జున్‌రెడ్డి’ పాత్రని గుర్తు చేస్తాయి. లిల్లీగా ర‌ష్మిక అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ప్రథ‌మార్ధం వ‌ర‌కు ప‌క్కింటి అమ్మాయిలా సంద‌డి చేసింది. సెకెండ్ హాఫ్ లో రష్మిక కు అసలైన పరీక్ష ఎదురైంది.ఎమోషన్స్ పండించ‌డంలోనూ, స‌హ‌జంగా క‌నిపించ‌డంలోనూ మంచి నటన ను కనబరిచింది. విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ మ‌రోసారి హైలైట్‌గా నిలిచింది. ర‌ష్మిక‌కి అక్కగా శ్రుతి రామ‌చంద్రన్ న‌టించింది. ఆమె కూడా తన అందంతో ఆక‌ట్టుకుంది. సంజ‌య్ స్వరూప్‌, శ్రీకాంత్ అయ్యర్‌, ఆనంద్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంది. మ్యూజిక్, ఛాయాగ్రహ‌ణం, నిర్మాణ విలువ‌లు సినిమాకి మరింత ఆకర్షణను పెంచాయి. కొత్త ద‌ర్శకుడు భ‌రత్ క‌మ్మ సెలెక్ట్ చేస్తుకున్న కథ బాగుంది , కానీ తను చెప్పాలనుకున్న కథాంశాన్ని కొత్త కోణం చూపించాలనుకున్నాడు కానీ అలా సినిమా ను తెరకెక్కించలేకపోయాడు. చాలా స్లో నేరేషన్ , ప్రేక్షకుడికి చాలా చోట్ల బోర్ అనిపిస్తుంది.
కానీ ఈ సినిమా లో హైలైట్ గా నిలిచింది విజయ్ ,రష్మిక ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ , వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇవే లేకపోతే సినిమా లో ఏవి లేవనే చెప్పొచ్చు.
విద్యార్ధి సంఘ నాయకుడు, లవర్ బాయ్ , క్రికెట్ ప్లేయర్ గా హీరోయిన్ ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో ఒక వర్గానికే నచ్చుతుందేమో కానీ అందరూ ఈ మూవీని ఆదరిస్తారా అనేది సందేహమే ! కానీ విజయ్ దేవరకొండ చిత్రం కనుక ఒకసారి చూసేయొచ్చు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *