Type to search

రాళ్ళపల్లి తనువు చాలించడం బాధాకరం: చిరంజీవి 

Actors Actresses Box Office Latest News News Top Stories Trenging News

రాళ్ళపల్లి తనువు చాలించడం బాధాకరం: చిరంజీవి 

cinema, actor, rallapalli, tollywood, tragedy, expired, demise, death, dead, motinagar, house, body, funeral, career, actor, villain, comedian, rachapalli, drama, stage, nandi, sthree, subhaleka, kaidi, abhilasha, sitara, alapana, dongapolisu, sundarakanda, raatnam, chiranjeevi, grief, mourn, mouring, memories, chennai, vani mahal, mega star, yester generation, rallapalli narasimharao, no more, health issues, maxcure hospital, tollywood industry, tollywood family, funeral proceedings, dead body, 800 films, 800 movies, character artist, west godavari, kukkakaatuku cheppudebba, drama field, stage plays, oorummadi batukulu, nandi award, alaya sikharam, mantrigari viyyankudu, srivari premalekha, nyayaniki sankellu, april 1 vidudala, surya ips, kannayya kittayya, bhale bhale magadivoy, latest celebrity updates, latest tollywood newsప్రముఖ హాస్య నటులు  రాళ్లపల్లి మృతి పట్ల మెగస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాళ్లపల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .’చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను మొదటి సారి  కలిశానని చెపుతూ  రాళ్లపల్లి నటనను బాగా అభిమానించేవాడిననీ . చెన్నైలో స్టేజ్‌పై    ఆయన నటనను చూసి నేను  ముగ్ధుడినయ్యా. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత  రాళ్లపల్లి  సినిమాల్లోకి వచ్చారు. మేమిద్దరమూ కలిసి చాలా  సినిమాల్లో నటిస్తున్నప్పుడు  ఆయనతో అనుబంధం ఏర్పడింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి.. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ‘మా’ ఎన్నికల సందర్భంగా  మేము కలుసుకున్నాం. ఆ సందర్భంలో ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరినొకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలోనే ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. రాళ్లపల్లి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని చిరంజీవి  చెప్పారు.

రాళ్లపల్లి  చాలా కాలంగా  శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించిన  విషయం తెలిసిందే.  ఆయన 850కి పైగా చిత్రాల్లో నటించి  తెలుగు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందించి మంచి నటుడిగా గుర్తింపు పొందారు . విభిన్నమైన  పాత్రల్లో నటించి  తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన రాళ్ళపల్లి  ఐదు నంది అవార్డులను గెలుచుకున్నారు .రాళ్లపల్లి పూర్తి పేరు  వెంకట నర్సింహారావు. రాళ్ల పల్లి నటించిన మొదటి చిత్రం స్త్రీ అయితే  ఆయన చివరి చిత్రం భలే భలే మొగాడివోయ్ .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *