Type to search

అమిత్ షా ఓ పాత్రధారి… కాలం ఆటలో పరాజితుడు చిదంబరం…

Latest News News Politics Top Stories

అమిత్ షా ఓ పాత్రధారి… కాలం ఆటలో పరాజితుడు చిదంబరం…

Chidambaram, Chidambaram arrest, Chidambaram arrested, CBI arrests chidambaram, inx media case, chidambaram inx media case, CBI vs chidambaram, ED vs chidambaram, cbi arrests chidambaram at his residence, cbi jumps wall, cbi jumps chidambarams wall, chidambaram at CBI hq, CBI HQ, karti chidambaram, narendra modi, amit shah, amit shah intentionally arrested Chidambaram, ys rajasekhar reddy, chidambaram fate, chidambaram karma💥💥💥💥💥💥💥💥💥💥💥
👉మయసభలో దుర్యోధనుడు చిన్నమడుగులో తెలియక కాలుపెడతాడు… ద్రౌపది నవ్వుతుంది. ఫలితం…. మహాభారత యుద్ధం… ద్రౌపది కూడా కావాలని నవ్వలేదు. అదొక అసంకల్పిత చర్య. ఎవరైనా అసహజంగా తొట్రుపడితే నవ్వు సహజంగా వస్తుంది… ఫలితంగా తోడికోడళ్లు అందరూ చూస్తూ వుండగా ద్రౌపదిని జుత్తుపట్టుకుని దుశ్శాసనుడు లాక్కెళతాడు. దీనికి ప్రతీకారంగా అతని రక్తాన్ని జుత్తుకు పూసుకుని కానీ కొప్పు ముడేయదు ద్రౌపది…
💥💥💥💥💥💥💥💥💥💥
👉రాజకీయాలెప్పుడూ ఇలాగే పగ, ప్రతీకారాలతో వుంటాయి.
చిన్న అవమానానికి ఒక యుద్ధమే చేయించిన దుర్యోధనుడు, చివరకు నిస్సహాయంగా పెద్ద మడుగులో దాక్కుంటాడు… అతన్ని రెచ్చగొట్టి, బయటికి రప్పించి భీముడు యుద్ధం చేస్తాడు. తొడల మీద గొట్టి చంపుతాడు. అక్కడ కొట్టడం యుద్ధధర్మం కాదు. అక్కడ కొడితే తప్ప దుర్యోధనుడు మరణించడు. కానీ….. గెలవడమే యుద్ధధర్మం…
👉భారతంలో వున్నదే ప్రపంచమంతటా వుంది. అక్కడ జరిగిందే, జరుగుతూ వుంటుంది.
💥💥💥💥💥💥💥💥💥💥
👉కాలమహిమ కాకపోతే, దేశంలో చక్రం తిప్పిన చిదంబరం కోర్టులో అలా పరుగులు తీయడం ఏమిటి..? ఆయన ఇంటిగోడలు దూకి సీబీఐ అధికారులు అరెస్టు చేయడం ఏమిటి..?
💥💥💥💥💥💥💥💥💥💥
👉నీవు నేర్పిన విద్యే కదా చిదంబరం..?
👉వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కు ఎంత చేశాడో కూడా మరిచిపోయి జగన్ మీద సిబీఐని ఉసిగొల్పావు.

👉సీబీఐకి విశ్వాసం తక్కువ. బొమికలు విసిరిన వాణ్ణి కూడా కరుస్తుంది.

👉కాలం ప్రతివాడికీ తన ఆటను చూపిస్తుంది.👇

👉సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన శశికళను జైల్లో కూచోపెట్టింది.

👉బీహార్లో చక్రం తిప్పిన లాలూతో, వూచలు లెక్కపెట్టించింది.

👉ఇందిరాగాంధీని కూడా ఓడించింది.
👉కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేయించింది.
👉హరిశ్చంద్రుడిని కాటికాపరిని చేసింది.
💥💥💥💥💥💥💥💥💥💥
👉ఇప్పుడు అమిత్ షా టైం నడుస్తోంది. గెలవడమే అతని ధర్మం…ధర్మ ఆధర్మ లు అప్రస్తుతం , ఈ ఎపిసోడ్ నీతి అదే….
💥💥💥💥💥💥💥💥💥💥
👉గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు…👇
👉శ్రేయోభిలాషుల్ని, మిత్రుల్ని, తటస్థుల్ని, ద్వేషించేవారిని, శత్రుమిత్రులని, పాపపుణ్యాల్ని సమదృష్టితో చూసేవాడు వృద్ధి సాధిస్తాడు (ధ్యానయోగం)…

👉చిదంబరం హార్వర్డ్ స్కూల్లో చదువుకున్నాడు కానీ, మెదడు పెరిగినట్టు అనిపించదు. అతనికి రాజశేఖరరెడ్డి అంటే అసూయ. ఎందుకంటే..? వైఎస్ ఒంటి చేత్తో రెండుసార్లు పార్టీని గెలిపించాడు… కేంద్రానికి అవసరమైన బలాన్ని ఇచ్చాడు. చిదంబరం తల్లకిందులుగా తపస్సు చేసినా సరే తమిళనాడులో కాంగ్రెస్ గెలవదు. ఆయనే అతికష్టమ్మీద గెలుస్తాడేమో… ఈ ఇన్ఫీరియారిటీలో చిదంబరం చాలా చేశాడు. అవన్నీ ఇప్పుడు తన మెడకే చుట్టుకున్నాయి.

👉మనం వానపాములు అనుకున్నవి తాచుపాములవుతాయి. అమిత్ షా ఈ లెవల్లో కరుస్తాడని చిదంబరం వూహించలేదు అస్సలు.

👉చరిత్రలో ఎప్పుడూ వూహకు అందని సంఘటనలే జరుగుతూ వుంటాయి.👇

👉ప్రధాని నెహ్రూ వచ్చి ప్రచారం చేస్తే కూడా అనంతపురంలో నీలం సంజీవరెడ్డి వోడిపోయాడు. అసలు ప్రచారమే చేయని తరిమెల నాగిరెడ్డి గెలిచాడు.
👉రాజనారాయణ అనే కోన్ కిస్కా (ఇందిరా కాంగ్రెస్ దృష్టిలో…) ఏకంగా ఇందిరాగాంధీనే ఓడించాడు.
👉చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీయార్ వోడిపోయాడు.
👉ప్రజాస్వామ్యం గొప్పదనం అదే.👆
💥💥💥💥💥💥💥💥💥💥
👉చిదంబరం తరువాత Next ఎవరు..?
👉తెలుగు రాష్ట్రాల నాయకులే నెక్స్ట్ టార్గెట్ అని అందరూ అనుకుంటున్నారు… ఏమో, చట్టం ఎల్లకాలమూ ఒకరికి చుట్టంగా ఉండలేదు కదా.

👉చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందో లేదో తెలియదు గానీ, మోడీ అండ్ అమిత్ షా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు.. చూద్దాం👀, ఈ దేశాన్ని ఏం చేస్తారో…?

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *