Type to search

నింగికేగిన చంద్ర‌యాన్-2 ..సైంటిస్టులకు స‌లాం..!

Latest News News Top Stories Trenging News

నింగికేగిన చంద్ర‌యాన్-2 ..సైంటిస్టులకు స‌లాం..!

chandrayaan 2.0, chandrayaan launch live, isro live, sriharikota, chandrayaan 2, chandrayaan 2 live, chandrayaan 2 launch video, chandrayaan 2 live streaming, chandrayaan 2 countdown, isro live chandrayaan 2, isro live stream, isro live channel, raatnam, chandrayaan 2.0 bahubaliశాస్త్ర‌, సాంకేతిక రంగంలో నూత‌న అధ్యాయం మొద‌లైంది. భార‌తదేశ సైంటిస్టులు మ‌రో ఘ‌న‌త‌ను సాధించారు. ఇప్ప‌టికే శాటిలైట్ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వీరు ..త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌కు మ‌రింత ప‌దును పెట్టి..స‌క్సెస్ అయ్యారు. లేట్ అయినా లేటెస్ట్‌గా కేవ‌లం ఒకే ఒక్క నిమిషంలో చంద్రయాన్ -2ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించారు. ప్ర‌పంచం విస్తుపోయేలా సాధించారు. త‌మ‌కు ఎదురు లేదంటూ చాటి చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నెల‌వై వున్న స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష ప‌రిశోధ‌న కేంద్రంలోని రెండ‌వ లాంఛింగ్ స్టేష‌న్ నుంచి దీనిని స‌క్సెస్‌ఫుల్‌గా ప్ర‌యోగించారు. ఎప్పుడెప్పుడా అని జాతి యావ‌త్తు ఎదురు చూసిన క్ష‌ణాలు వాస్త‌వ‌మ‌య్యేలా చేశారు మ‌న సైంటిస్టులు. సార్ నుంచి జిఎస్ఎల్‌వి మార్క్ 3ఎం1 రాకెట్ ద్వారా చంద్ర‌యాన్ -2 రివ్వుమంటూ నింగిలోని చంద‌మామ‌ను ప‌ల‌క‌రించేందుకు దూసుకెళ్లింది.

సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో కొన్ని రోజులు ఆల‌స్యమైంది. నిమిషం అటు ఇటు కాకుండా క‌రెక్టు టైంకు దీనిని ప్ర‌యోగించ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంద‌లాది మంది సైంటిస్టులు, ప్రొఫెష‌న‌ల్స్, వివిధ రంగాల‌కు చెందిన ప‌ర్స‌నాలిటీస్ తో పాటు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ కూడా చంద్ర‌యాన్ -2 ప్ర‌యోగ స‌మ‌యంలో అక్క‌డ కొలువు తీరారు. ఈ సంద‌ర్భంగా ఇస్రో ఛైర్మ‌న్ కె. శివ‌న్ చంద్ర‌యాన్ -2 త‌యారీలో పాలు పంచుకున్న ప్ర‌తి ఒక్క‌రిని పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొత్తం ప్ర‌యోగం ఫ‌ల‌వంతం కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవ‌లం ఏడు రోజుల్లోనే సాంకేతిక లోపాన్ని గుర్తించి, ఆయిల్ ను పూర్తిగా తీసివేసి ..తిరిగి నింగికి ఎగిసేలా తీర్చిదిద్ద‌డంలో సైంటిస్టులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. వారి క‌ళ్ల‌ల్లో చెప్ప‌లేని ఆనందం తొంగి చూసింది. ఓ వైపు అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, జ‌పాన్, చైనా, పాకిస్తాన్, ర‌ష్యా, త‌దిత‌ర దేశాల‌న్నీ చంద్ర‌యాన్ -2 ఇండియా ఏ రీతిన విజ‌య‌వంతం చేస్తుందోనంటూ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌డంతో ఇస్రోలో నెల‌కొన్న ఉద్విగ్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా తేలిక‌గా మారి పోయింది. చైర్మ‌న్ పెద‌వుల మీద న‌వ్వు విరిసింది. ఆయ‌న‌తో పాటు ప‌నిచేసిన స‌హ‌చ‌ర శాస్త్ర‌వేత్త‌లంతా సంతోషంలో మునిగి పోయారు. ఒక‌రినొక‌రు ప‌రస్ప‌రం అభినందించుకున్నారు.ఇది ఇస్రోలోని ప్ర‌తి ఒక్క‌రి విజ‌య‌మ‌ని, దేశం సాధించిన గెలుపుగా అభివ‌ర్ణించారు కె.శివ‌న్. వాస్త‌వానికి ఈనెల 15న‌నే చంద్ర‌యాన్ -2 నింగిలోకి వెళ్లాల్సి ఉండ‌గా చిన్న‌పాటి సాంకేతిక లోపం సంభ‌వించింది. నెల‌కొన్న లోపాన్ని స‌రి చేయ‌డంతో తిరిగి ప్ర‌యోగానికి సిద్ధం చేశారు. బాహుబ‌లిగా పేర్కొనే జిఎస్ఎల్‌వి మార్క్ 3ఎం1 రాకెట్ బ‌రువు 640 ట‌న్నులు, 3 వేల 877 కిలోల బ‌రువు క‌లిగి ఉంది. చంద్ర‌యాన్ -2 కంపోజిట్ మాడ్యూల్ సాయంతో ఈ రాకెట్ ప‌య‌నిస్తుంది. చరిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఇది అని శివ‌న్ పేర్కొన్నారు. చంద్రుడిపైకి భారత్ చేసిన చారిత్రక ప్రయాణమిది అని, వచ్చే 24 గంటలు చాలా కీలకం అని చెప్పారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని, ఇంకా చాలా ఉందన్నారు. మొత్తం మీద స‌క్సెస్ కావ‌డంతో ..భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి కోవింద్, ప్ర‌ధాని మోదీలు శివ‌న్‌తో పాటు ఇస్రో టీంకు అభినంద‌న‌లు తెలిపారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *