Type to search

వైఎస్ జగన్ సర్కార్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

News Politics

వైఎస్ జగన్ సర్కార్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

chandra babu naidu, raatnam, tdp, tdp leader, tdp chandra babu naidu, chandra babu naidu about jagan, jagan, ycp, jagan chandra babu naiduగుంటూరు: ‘నా రాజకీయ జీవితంలో ఇంత అరాచకపాలన చూడలేదు’ అని వైసీపీ సర్కార్‌ను ఉద్దేశించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు వైసీపీ బాధితుల గురించి మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఏపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల అరాచకాలపై పుస్తకం విడుదల చేశారు. నాగరిక ప్రపంచంలో అనాగరిక పాలన సాగుతోందని బాబు దుయ్యబట్టారు. పులివెందుల ఫ్యాక్షనిజం గుప్పిట్లో రాష్ట్రం పేరుతో మరో పుసక్తాన్ని ఆయన రిలీజ్ చేశారు.

అమ్మాయిలపై కూడా నీచమైన పోస్ట్‌లు!

‘వైసీపీ బాధితుల స్వగ్రామంలో నివసించే హక్కు కోసం రేపు చలో ఆత్మకూరు పేరుతో మరో పుస్తకం విడుదల చేస్తాం. వైసీపీ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. జగన్‌ పులివెందుల మోడల్‌ పంచాయతీ తీసుకొచ్చారు. టీడీపీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేశారు, దాడులకు తెగబడ్డారు. సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్‌ పెడితే ఎదురుదాడి చేస్తున్నారు. నిజాలు మాట్లాడిన అమ్మాయిలపై కూడా నీచమైన పోస్ట్‌లు పెడుతున్నారు. ఆడబిడ్డల క్యారెక్టర్‌ అసాసినేషన్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *