Type to search

సినిమా టీజర్లకు సెన్సార్ ఉండదా ? దర్శక నిర్మాతలు కొద్దిగా ఆలోచించండి !

Actors Actresses Box Office News Stories

సినిమా టీజర్లకు సెన్సార్ ఉండదా ? దర్శక నిర్మాతలు కొద్దిగా ఆలోచించండి !

raatnam, movies, films, film board, censor, censor board, censor on films, censor certificate to films, censor certificate to film teasers, censor certificate to film trailers, censor to teasers and trailers, latest trailers, latest teasers, teaser, trailer

సినిమా విడుదల చేయడానికి ముందుగా సెన్సార్ బోర్డు కు వెళ్లడం ఆనవాయితీ. సెన్సార్ సభ్యలు ఆ చిత్రాన్ని చూసి ఏ సీన్లు ఉంచొచ్చో ,ఏది ఎడిట్ చేసేయాలో చెప్పాక, అప్పటికీ కూడా కొన్ని అభ్యంతరకర సీన్లు లేదా హింసాత్మక దృశ్యాలు ఉంటే ఆ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వడం లేదా కొన్ని చిత్రాలకు A /U సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.
A సర్టిఫికెట్ తో రిలీజ్ అయిన చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్లలు చూడకూడదని అర్థం.అలాగే A /U చిత్రాన్ని పెద్దలతో కలిసి ఆ చిత్రాన్ని చూడొచ్చని కూడా రాస్తారు.ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు A సర్టిఫికేట్ ఇచ్చినా కూడా పిల్లలను థియేటర్లలో అనుమతిస్తున్నారు. ఎవ్వరూ కూడా అభ్యంతర పెట్టడం లేదు. ఇవంతా సినిమా లు థియేయటర్లలో ప్రదర్శనకు అనుమతినిచ్చే అంశాలు .
అధికారికంగా ఆ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు చూడ్డానికి వీలు లేదు అని సెన్సార్ బోర్డు తీర్మానించి A సర్టిఫికెట్ ఇచ్చిందని అర్థం. A ఉంది కాబట్టి పెద్దలు తమ పిల్లలను ఆ చిత్రాలకు తీసుకెళ్లరు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ప్రతి సినిమా కూడా రిలీజ్ కు ముందు టీజర్ అనీ , పోస్టర్ రిలీజ్ అనీ ,ట్రైలర్ అనీ రకరకాలుగా మీడియా కు విడుదల చేస్తున్నారు.ఆ చిత్రాల్లోని అస్లీల ,అసభ్య ,అభ్యంతరకరమైన సీన్లను చూపెడుతూ సినిమా ప్రమోషన్ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
వీటిలో పిల్లలు చూడకూడని దృశ్యాలను కూడా పోస్ట్ చేసేస్తున్నారు. వీటిని ఎవరూ కంట్రల్ చేయడం లేదు .సెన్సార్ బోర్డు ‘ఏ ‘సర్టిఫికెట్ ఇచ్చింది మరి ఆ చిత్రం లోని అస్లీల, అసభ్య దృశ్యాలను ఎందుకు సోషల్ మీడియా లో విడుదల చేస్తున్నారు.? ఇలా అయితే అలాంటి సీన్లను ఇక పిల్లలు సినిమా థియేటర్లలో కాకుండా హ్యాపీగా ఇంటర్నెట్ లో ,ఇక వారి చేతిలోఉన్న ఫోన్ లో కూడా చూస్తున్నారు.దీనివల్ల సెన్సార్ బోర్డు ఇచ్చిన సరిటిఫికేట్ కి విలువేముంది? ఇంకా చాలా సులభంగా యువత, చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు .ఆ పసి మనస్సులో ఇలాంటి దృశ్యాలు ఎంతటి అలజడిని సృష్టిస్తాయో అని తలిదండ్రులు ఆందోళన గురిఅవుతున్నారు .నిన్నటికి నిన్న విడుదలైన’ ఆమె ‘మూవీ టీజర్ లో హీరోయిన్ అమలాపాల్ పూర్తి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని విడుదల చేశారు. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చారు .కానీ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ చిత్ర యూనిట్ అమల పాల్ నగ్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని ఇప్పటికే సోషల్ మీడియా లో కొన్ని లక్షల మంది చూసారు. వారిలో దాదాపు ఎక్కువమంది యూత్ ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే.ఇంతటి దారుణమైన ,అసభ్యకరమైన సీన్ ను డైరక్ట్ గా సోషల్ మీడియా లో పోస్ట్ చేసేందుకు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందా? థియేటర్లలో చూసేందుకు కూడా అనుమతి లేనప్పుడు ,తమ అర చేతుల్లోనే పిల్లలు చూసేస్తుంటే దీనికి ఎవరు బాధ్యులు ? పిల్లలను సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఆపగలం గానీ ఇంట్లోనే , తమ అరచేతుల్లోనే చూసే సౌలభ్యం ఉంటే ఎవరు ఆపగలరు ? ఎలా ఆపగలరు ? ఇంట్లోనే కాదు బయటకెళ్ళి చూడొచ్చు , స్నేహితుని ఫోన్లో ఏ రోడ్డు మీద కూడా నిలబడి చూసేస్తున్నారు.సోషల్ మీడియా లో వచ్చే చాలా వాటిని ఎవరూ ఆపలేరు . కానీ సెన్సార్ బోర్డు ‘ఏ ‘ సర్టిఫికెట్ ఇచ్చిన చిత్రం లోని అశ్లీల ,అసభ్యకర సీన్లను సోషల్ మీడియా లో విడుదల చేయకుండా ఆపాలి అది కూడా సెన్సార్ బోర్డ్ చెప్పాల్సిన అవసరం ఉంది .మీడియా లో ప్రత్యేకించి సోషల్ మీడియా లో అలాంటి దృశ్యాలను ప్రమోషన్ లో భాగంగా విడుదల చేయడానికి అనుమతిని నిరాకరించాలి. కేబుల్ టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసే చిత్రాల్లో దాదాపు అసభ్యకర ,అభ్యతరకర దృశ్యాలను కట్ చేసి ప్రసారం చేస్తుంటారు. కానీ ఈ సోషల్ మీడియా లో మాత్రం ఎలాంటి ఎడిటింగ్ లేకుండా పోస్ట్ చేసేస్తున్నారు. అయితే ప్రమోషన్ అనే పేరుతో అన్నీ సీన్లను పోస్ట్ చేసే చిత్ర యూనిట్ మాత్రం సెన్సార్ బోర్డు కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సీన్లను చూసి తమ తోటి విద్యార్థినులను మాటలతో అవమాన పరిచేవారు కూడా ఎక్కువతున్నారు.మరి ఇలాంటి నగ్న దృశ్యాలను చూడ్డం వలన యువత ఎలాంటి పెడదోవ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా వాళ్ళు వ్యాపారస్తులే కావొచ్చు కానీ సమాజానికి ఎంతో అవసరమైన విద్యార్థులు , యువతను చెడు మార్గం వైపుకు వెళ్లకుండా చూసే బాధ్యతను కొంతలోకొంతైనా తీసుకుంటే ఇలాంటి నగ్న దృశ్యాలను, అస్లీల పోస్టర్లను కనీసం సోషల్ మీడియా లో పోస్ట్ చేయకుండా ఉంటే సమాజానికి తమవంతు సేవ చేసిన వారవుతారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *