Type to search

ఏపీ కేపిటల్ సిటీపై టీజీ కామెంట్స్ కలకలం

Latest News News Politics

ఏపీ కేపిటల్ సిటీపై టీజీ కామెంట్స్ కలకలం

BJP MP TG Venkatesh, BJP MP TG Venkatesh Shocking, BJP MP TG Venkatesh Shocking Comments, TG Venkatesh Shocking Comments On AP, Shocking Comments On AP CM YS Jagan, Comments On AP CM YS Jagan, AP CM YS Jagan over AP Capital Change, Venkatesh Shocking Comments On AP CM, Shocking Comments On AP CM YS, AP CM YS Jagan over AP Capital, AP Capital Changeఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికే గందరగోల పరిస్థితులు నెలకొన్న సమయంలో బీజేపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని గా ఉండదని, ఏపీని నాలుగు రాజధానులుగా చేస్తారని మరో వివాదానికి తెర తీశారు. ఇప్పటికే అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు అదే పార్టీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడారు. అయితే ఏపీలో జరిగి ప్రతి నిర్ణయం గురించి ప్రధాని, హోమ్ మంత్రిలకు సమాచారం ముందే ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు. మరో ట్విస్ట్ కు ఆజ్యం పోశారు. చంద్ర బాబు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో , ఇక అప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ వేటాడటం మొదలు పెట్టారు. బాబు తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేయడమో లేక నిలిపి వేయడమే చేస్తూ వస్తున్నారు.

పోలవరం విషయంలో ఆయన ఇదే స్టాండ్ తీసుకున్నారు. కానీ గతంలో పనులు చేజిక్కించుకున్న నవయుగ నిర్మాణ కంపెనీని పనుల నుండి తప్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ సదరు కంపెనీ కోర్టుకు వెళ్ళింది. విషయాన్ని పూర్తిగా పరిశీలించిన ధర్మాసనం జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని స్పష్టం చేసింది. నిరభ్యంతరంగా పనులు చేపట్టవచ్చంటూ తీర్పు చెప్పింది. దీంతో సర్కార్ పునరాలోచనలో పడింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి సీరియస్ అయ్యారు. డబ్బులు ఇస్తున్నది మేమే..అడిగే అధికారం మాకు కూడా ఉంటుంది అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. ఆయనకు సంబంధించి భద్రతను తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

దీనిపై కూడా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లా ఉండగా రాజధాని అమరావతిపై నానా రకాలుగా రాద్ధాంతం జరుగుతోంది. వైసిపి ఇప్పుడు దీనిని టార్గెట్ చేస్తోంది. వరదలు వస్తే కేపిటల్ సిటీ పూర్తిగా మునిగి పోతుందని, ఇది ఎంత మాత్రం సురక్షితం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ విషయం గురించి వివరాలతో కూడిన నివేదిక అందజేసిందని అంటోంది. ఇదిలా ఉండగా జనసేన దగ్గరకు రైతులు వెళ్లి కలిశారు. తమకు న్యాయం చేయాలనీ కోరారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అమరావతిని కాదని వేరే ఆలోచన నుంచి విరమించు కోవాలని అన్నారు పవన్. మొత్తం మీద రోజుకో ప్రకటన చేస్తూ జనాన్ని గందరగోళంలోకి నెట్టి వేస్తున్నారు. మధ్యలో టీజీ చేసిన కామెంట్స్ మెట్నాలు రేపుతున్నాయి.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *