Type to search

బాహుబలి రికార్డులలో ఇంకో అరుదైన రికార్డు

Box Office News Trenging News

బాహుబలి రికార్డులలో ఇంకో అరుదైన రికార్డు

Bahubali, prabhas, rana, rana daggubati, Raatnam, tamannaah, anushka shetty, mm keeravani, ss rajamouli, bahubali the beginning, bahubali the conclusion, Royal Albert Hall, bahubali in Royal Albert Hall, bahubali Royal Albert Hall, bahubali premiered in Royal Albert Hallలండన్ లోని ఆల్బర్ట్ హాల్ లో గత 148 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లీష్ సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారిగా నాన్ ఇంగ్లీష్ సినిమాను రాయల్ ఆల్బర్ట్ హాల్ లో శనివారం ప్రదర్శించారు. ఇది మన తెలుగు దర్శకుడు తెరకెక్కించిన బాహుబలి చిత్రం అవ్వడం తెలుగు వారికి తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవం.

‘బాహుబలి’ సినిమా వచ్చి నాలుగేళ్లు గడిచిపోయినా దాని క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గడంలేదు. బాహుబలి సీరీస్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు ఎటువంటి రికార్డులను సృష్టించాయో అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా రెండువేల కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది.
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఈ ప్రదర్శనకు బాహుబలి యూనిట్ అంతా హాజరైంది. బాహుబ‌లి మెయిన్ టీమ్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రాజ‌మౌళి,రానా, శోభు యార్ల‌గ‌డ్డ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రాజ‌మౌళి పంచెక‌ట్టులో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం విశేషం. ఈ వేదిక మీద సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి నేపథ్య సంగీతాన్ని లైవ్‌లో పర్‌ఫార్మ్ చేసిన‌ట్టు సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *