Type to search

అనుకోని అతిథి’గా వస్తున్న సాయి పల్లవి

Actors Actresses Box Office News

అనుకోని అతిథి’గా వస్తున్న సాయి పల్లవి

sai pallavi, sai pallavi movies, sai pallavi latest movies, sai pallavi dubbing movies, sai pallavi upcoming movies, sai pallavi anukoni athidi, athiran, sai pallavi athiran, anukoni athidi, fahad fazil, prakash raj, sai pallavi athiran in teluguసాయిపల్లవి నటించిన మలయాళ చిత్రం ‘అధిరన్’ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అనుకోని అతిథి’గా విడుదల చేయనున్నారు.. కేరళలో 1970లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.
ఫాహద్ ఫాజిల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ను తెలుగులో ‘అనుకోని అతిథి’గా అనువదించారు. ఈ చిత్రానికి నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్. ఈ సినిమాను జయంత్ ఆర్ట్స్ పతాకంపై సినిమా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి వెల్లడిస్తూ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ‘‘త్వరలో ఈ చిత్ర ట్రైలర్ ని, తర్వాత చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచన లో ఉన్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రస్తుతం మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.
రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతికృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, మాటలు: ఎం. రాజశేఖర్రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పడిమి కాల్వ, నేపథ్య సంగీతం: జిబ్రాన్, సంగీతం: పిఎస్ జయహరి.
ప్రస్తుతం సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న విరాట పర్వం చిత్రం లో హీరోయిన్ గా చేస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *