Type to search

“కమ్మ” ..అమ్మగా “రెడ్లు”.. బిడ్డలుగా మార్పు

Box Office News

“కమ్మ” ..అమ్మగా “రెడ్లు”.. బిడ్డలుగా మార్పు

Amma Rajyamlo Kadapa Biddalu ,Kamma Rajyam Lo Kadapa Reddlu Motion Poster, RGV, Ravi Shankar, Sira Sri, Kamma Rajyam Lo Kadapa Reddlu, Ram Gopal Varma, #KammaRajyamLoKadapaReddlu, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie, Sirasri, RGV New Movie, RGV New Movie Teaser, ram gopal varma new movie, Kamma Rajyam Lo Kadapa Reddlu Teaser, Kamma Rajyam Lo Kadapa Reddlu Song, Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer, RGV New Movie Song, kamma rajyam motion poster, RGV Movies, RGV Channel, raatnam, Babu Champestadu, Babu Champestadu song, Babu Champestadu muhurtam, Babu Champestadu kamma rajyamlo kadapa reddlu, Kamma Rajyam Lo Kadapa Reddlu trailer, krkr trailer, Kamma Rajyamlo Kadapa Reddlu title change, Kamma Rajyamlo Kadapa Reddlu Amma Rajyamlo Kadapa Biddaluనిత్య వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు జరగనున్నాయి. రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాలతో ఈ చిత్రానికి సెన్సార్ అనుమతి లభిస్తుందా, రేపు విడుదల అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది చర్చెనీయాంశం అయింది. ఇటువంటి సమయం లో సెన్సార్ కు సినిమాను పంపించే ముందు సంచలన దర్శకుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చుతూ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టైటిల్ తోనే సెన్సార్ బోర్డ్‌కు అనుమతికి వెళ్లనున్నారు వర్మ.
గతంలో తన సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూ చెబుతూ వచ్చాడు టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ బయటకు వదులుతూ సంచలనం సృష్టించాడు వర్మ. సిద్ధార్థ్‌ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహించాడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.
ఇకపోయతే ఈ సినిమాపై వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తనను కించపరిచేలా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్ ఉందని, ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఈ చిత్రానికి మరో సెగ తగిలింది.
కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంద్రసేనా చౌదరి అనే వ్యక్తి ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా విడుదల అయితే కమ్మ, రెడ్డి కులస్థుల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. కావున వెంటనే విచారణ జరపాలి’ అని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వదేరా కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *