Type to search

అతడొక ఆయుధం ..అంతుపట్టని షా అంతరంగం..!

News Politics Stories Top Stories

అతడొక ఆయుధం ..అంతుపట్టని షా అంతరంగం..!

raatnam, narendra modi, narendra modi cabinet, narendra modi 2.0, narendra modi cabinet 2019, narendra modi cabinet ministers, narendra modi cabinet ministers 2019. amit shah, amit shah narendra modi, amit shah and narendra modi, amit shah after narendra modi, amit shah in narendra modi cabinet, amit shah central home minister, article on amit shahభారత దేశంలో ఎప్పుడైతే నరేంద్ర మోదీజీ ప్రధాన మంత్రిగా కొలువు తీరారో అప్పుడే దాటాయి దేశాలు కలవరపడ్డాయి. చాప కింద నీరులా పీఎం కు నీడలా వెన్నంటి ఉండే ఒకే ఒక్క నమ్మకస్థుడు అమిత్ అనిల్ చంద్ర షా. అందరూ అతడిని అమిత్ షా అని ముద్దుగా పిలుస్తారు. నిన్నటి దాకా ఆయన పేరు కొద్ది సేపే వినిపించింది. తాజాగా ఆయన పేరు లేకుండా ఉండలేని స్థితికి ఈ దేశం చేరుకుంది. ఎక్కడ చూసినా ..ఎక్కడికి వెళ్లినా ..అంతటా అమిత్ షా నే. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ విషయంలో షా ..మోదీజీ అనుసరించిన కఠిన వైఖరికి అమెరికా లాంటి పెద్దన్న మిన్నకుండి పోయింది . అంతర్జాతీయంగా ఇండియాకు యెనలేని మద్దతు పెరుగుతుండగా ..మరో వైపు రష్యా బేషరతుగా భారత్ వైపు నిలిచింది .

దీంతో దాయాది దేశం పాకిస్తాన్ ప్రపంచ రంగస్థలం లో ఒంటరిగా మిగిలి పోయింది . అయినా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ మొత్తం వ్యవహారంలోనీ కాదు దేశ వ్యాప్తంగా కాషాయ జెండా యుగురా వేసే పనిలో పడ్డారు అమిత్ షా. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ రాజకీయంగా కోలుకోలేకుండా చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు అమిత్ షా నే . బీజేపీకి ఇప్పుడు అతడే ఆయుధం. ఆయనకే ఎక్కడ కాలు మోపాడంటే చాలు ..అక్కడ సునామి రావాల్సిందే. నిన్నటి దాకా షా పేరు వినిపించినా ఇప్పుడు మొత్తంగా అటు పార్టీలోనూ ఇటు దేశ రాజకీయాల్లోనూ …కేంద్ర సర్కార్ లోను షా చెప్పిందే వేదం . షా పథకం రచిస్తారు .. మోడీ పర్మిషన్ ఇస్తాడు . వెంటనే అమలవుతుంది అంతే . ఇక రెండో ముచ్చట లేనే లేదు .

యుద్ధానికైనా ..లేక పోట్లాడేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ షా.. మోడీ ఇప్పటికే ప్రకటించారు . ఏ ఒక్కరు వీరికి ఎదురు చెప్పే పరిస్థితుల్లో లేరు. సౌత్ లో తన ప్లాన్ వర్కవుట్ అయ్యింది . ఇక మిగిలింది తెలంగాణ . అది కూడా అమలు చేసేందుకు ఇప్పటినుంచే ప్లాం చేయడంలో నిమగ్నమయ్యారు అమిత్ షా. తెలంగాణాలో కేసీఆర్ కు వెన్ను దన్నుగా ఉన్న మై హోమ్ రామేశ్వర్ రావు ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు రెడీ అయ్యారు . ఇటీవల భారీ ఎత్తున ఐటి అధికారులు దాడులు చేశారు. ఈ విషయం గురించి బయటకు పొక్కలేదు . ఇప్పటికే మీడియా పరంగా వాటాలు తీసు కోవడంపై కూడా కన్నేశారు. మొత్తం మీద మోడీ ..షా ..దోవల్ ఈ ముగ్గురు ఇండియాను ఏలుతున్నారు. ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *