Type to search

అమెరికా షాక్…పాకిస్థానీ అణుస్థావరాల అడ్రస్సులన్నీ లీక్…

Latest News News Top Stories Trenging News

అమెరికా షాక్…పాకిస్థానీ అణుస్థావరాల అడ్రస్సులన్నీ లీక్…

pakistan, india, rival countries, india pakistan, article 370, kashmir, united nations, united nations security council, unsc, siva sena, narendra modi, imran khan, donald trump, imran khan, donald trump about imran khan, america leaks pakistan weapon locations, pakistan weapon locations leaked, usa leaked pakistan nuclear basesఅక్టోబరులో ఇక చివరి యుద్ధం అని రంకెలేస్తున్నాడు ఓ పాకిస్థానీ మంత్రి… జాగ్రత్తరోయ్, మేం అణుబాంబులు వేసేస్తాం అంటున్నాడు ఇమ్రాన్… పెద్దపెద్దవే కాదు, షార్ట్ రేంజ్ అణ్వస్త్రాలు కూడా ఉన్నయ్, జాగ్రత్త ఇండియా అని హెచ్చరిస్తున్నాడు అబ్బాసీ… అంతేనా..? భారత దేశానికి తన దేశం మీదుగా ఉండే కమర్షియల్ ఎయిర్ స్పేస్ మూసేసింది… గుజరాత్ తీరంపైకి ఉగ్రవాదుల్ని తరలిస్తున్నదని వార్తలు… తమిళనాడులోకి కూడా కొందరిని పంపించిందని మరికొన్ని నిఘా సంస్థల వార్తలు… అన్నింటికీ మించి ఘజ్నవి అనే అణ్వాయుధాల్ని మోసుకెళ్లగల క్షిపణిని రాత్రిపూట సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది… ఇలా ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, కాశ్మీర్‌లో వేలు పెట్టిన పాపానికి శిక్షించబోతున్నాం అనే కలరింగు ఇస్తున్నది పాకిస్థాన్… ఫోఫోవోయ్, సాక్షాత్తూ నీ కార్యాలయం కరెంటు బిల్లు కట్టుకునే స్థోమత లేదు, నువ్వు యుద్ధం చేస్తావా..? అని నెట్‌లో జోకులు పేలుతున్నయ్ ఇంకోవైపు… కాశ్మీర్ సంగతి తరువాత, అసలు నువ్వు పీవోకేను కాపాడగలవా అని వెక్కిరిస్తున్నయ్ ప్రతిపక్షాలు… ఈ స్థితిలో పాకిస్థాన్ ప్రభుత్వం తెలివిగా ‘ఏదో చేసేస్తున్నట్టుగా’ షో స్టార్ట్ చేసింది… ఎందుకంటే..?

నిజానికి ఈ ఘజ్నవి ఏనాటి నుంచో… అంటే… 2004 నుంచి పాకిస్థాన్ దగ్గర ఉన్నవే… అవి అణ్వాయుధాలను మోసుకెళ్లగల స్వల్పదూర క్షిపణులు… అంటే మహా అయితే 300 కిలోమీటర్ల రేంజ్… ఇండియాలోని కొన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి… ఇప్పుడు దాన్ని కొత్తగా పరీక్షించాల్సిన పనేమీ లేదు… అసలు ఇవే కాదు… ఉత్తర కొరియా, చైనా సహకారంతో పాకిస్థాన్ క్షిపణుల్ని భారీగానే సంపాదించుకుంది… హతాఫ్ (50 కి.మీ), నాసర్ (70 కి.మీ), అబ్దలి (200 కి.మీ)… వీటిని బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్ అంటారు… ఇక ఘజ్నవి (300 కి.మీ), షహీన్-1 (900 కి.మీ)… ఇవేమో షార్ట్ రేంజ్… మీడియం రేంజ్‌లో ఘౌరి-1, 2 (1500- 1800 కి.మీ) నుంచి షహీన్-2, 3 (3000 కి.మీ దాకా…) ఉంటాయి… క్రూయిజ్ మిస్సయిల్స్‌లో బాబర్, హతాఫ్… (ఆమధ్య ఎవరో భారతీయనాయకుడు ప్రస్తావించినట్టు ఘౌరి, బాబర్ వంటి ఉన్మాద పాలకుల పేర్లు ఇవి)… ఎయిర్ టు సర్‌ఫేస్, సర్‌ఫేస్ టు ఎయిర్, సీ టు సర్‌ఫేస్ అన్ని క్షిపణులూ ఉన్నయ్…

పాకిస్థాన్ క్షిపణి పరిజ్ఞానం ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు గానీ… ఇండియా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉంది… వీటికి మించిన మరో ముఖ్య వార్త అమెరికన్ పత్రికల్లో కనిపిస్తున్నది… అదేమిటీ అంటే..? అమెరికా పాకిస్థాన్ దగ్గరున్న అణ్వాయుధాలపై కంట్రోల్ తీసుకునే ఆలోచనలో ఉంది… గాడి తప్పిన దేశం కాబట్టి, ఉగ్రవాదుల గుప్పిట్లో రాజకీయాలు, పాలన చిక్కుకున్న దేశం కాబట్టి, తన అణ్వాయుధాలు గానీ, ఆ పరిజ్ఞానం గానీ, ఆ మెటీరియల్ గానీ ఉగ్రవాదుల చేతులకు చిక్కితే ప్రమాదం అనేది అమెరికా ఆందోళన… ఆ దేశం ఏకంగా పాకిస్థాన్ ఎక్కడెక్కడ అణ్వాయుధాల్ని దాచిపెట్టిందో కూడా బయటపెట్టింది… కాకపోతే ఇండిపెండెంట్ పరిశోధన పేరిట ఓ ముసుగు వేసింది… కమర్షియల్ శాటిలైట్లు, స్థానిక పత్రికల వార్తలు, నిపుణుల అంచనాలతో తొమ్మిది స్థలాల పేర్లను ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు బహిరంగపరిచారు… నాలుగు పంజాబ్ ప్రాంతంలో… మూడు సింధ్ ప్రావిన్సులో… ఒకటి బెలూచిస్థాన్‌లో… ఒకటి ఖైబర్ కనుమల్లో… అవి…

1. Akro Garrison, Sindh (Possible underground weapons storage site)
2. Gujranwala Garrison, Punjab (Possible weapons storage with components in remote)
3. Khuzdar Garrison, Balochistan (Possible underground weapons storage site)
4. Masroor Depot (Karachi), Sindh (Potential storage of bombs for Mirage Vs at Masroor AB)
5. National Development Complex (Fatehjang), Punjab (SSM launcher assembly and potential warhead component storage)
6. Pano Akil Garrison, Sindh (Possible weapons storage with components in remote depot)
7. Sargodha Depot, Punjab (Possible storage site of bombs for F-16s at nearby Sargodha AB and warheads for SSMs)
8. Tarbala Underground Depot, Khyber Pakhtunkhwa (Potential warhead storage)
9. Wah Ordnance Facility, Punjab (Possible warhead production, disassembly and dismantlement facility)

నో, నో, మా అణ్వాయుధాలు సురక్షితం, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆధీనంలో ఉంటయ్… మాది సుశిక్షితమైన రక్షణ వ్యవస్థ… అని పాకిస్థానీ పెద్దలు అప్పుడప్పుడూ చెబుతుంటారు గానీ… అవెంత డొల్లమాటలో ప్రపంచానికి తెలుసు… పాకిస్థాన్ మెల్లిమెల్లిగా పాలన సంక్షోభంలోకి వెళ్లేకొద్దీ అణ్వాయుధాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయో ఊహించడం కష్టంగా ఉంది అనే ఆందోళనను సైంటిస్టుల ఫెడరేషన్ వ్యక్తం చేస్తున్నది… అసలే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర పరీక్షలతో అణుయుద్ధానికి కూడా రెడీ అని అమెరికాకు సవాల్ విసురుతున్నది… మరోవైపు పాకిస్థాన్… ఈ స్థితిలో పాకిస్థాన్ అణ్వస్త్రాల మీద నియంత్రణ సాధించడం అవసరమనేది అమెరికా ఆలోచన… కానీ ఎలా..? సాధ్యమేనా..? అవీ అసలైన చిక్కు ప్రశ్నలు… అమెరికా బయటపెట్టిన అణుస్థావరాల సమగ్ర వివరాలను మార్క్ చేసి, ఇండియా రెడీగా పెట్టుకున్నది… అది ముక్తాయింపు..!

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *