Type to search

జియోను ఎయిర్ టెల్ అధిగమించేనా..?

Latest News News Trenging News

జియోను ఎయిర్ టెల్ అధిగమించేనా..?

airtel xstream smart box, airtel xstream vs jio giga tv, airtel xstream smart box price, airtel xstream set top box, jio gigafiber preview offer, airtel internet tv, jio celebration pack sep 2019, jio giga fiber 2 month free offer, jio 4k set top box unboxing, Jio Gigafiber Forever Plan, Jio Gigafiber Price, Jio Fiber Welcome Offer, Jio DTH Plans, Jio DTH Set Top Box, jio 1 year free offer, jio home tv review, techno neil, jio ftth installation, jio, dth, airtelఇండియన్ టెలికాం రంగంలో టాప్ రేంజ్ లో ఉంటూ తన దరిదాపుల్లోకి ఇతర కంపెనీలు రాకుండా చేస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో సంచలనానికి తెర లేపింది. ఇప్పటికే భారతీయ వ్యాపార రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ, సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థి కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది ఆర్.ఐ. ఎల్. ఆయిల్, లాజిస్టిక్స్, టెలికాం , జ్యుయలరీ , స్పోర్ట్స్, డిజిటల్ , తదితర రంగాలలో ఉన్నత స్థానంలో ఉంటోంది. ప్రపంచంలో అతి పెద్ద టెలికాం కంపెనీగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీల నుండి కస్టమర్స్ రిలయన్స్ జియో కు మారి పోయారు. తాజాగా ముంబై లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.

అదేమిటంటే తక్కువ ఖర్చుకే టీవీ, రేడియో, సినిమాలు, అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దెబ్బకు ఇతర కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడి పోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో వోడా ఫోన్ , ఐడియా , ఎయిర్ టెల్ , బీఎస్ యెన్ ఎల్ కంపెనీలు తమ టారిఫ్ లను మార్చు కోవాల్సిన పరిస్థితికి తీసుకు వచ్చింది ఆర్ ఐ ఎల్. ఈ ఒక్క ప్రకటన దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. 33 కోట్ల సభ్యులున్న జియో కస్టమర్లు ఇతర టెలికాం కంపెనీల నుండి మారి పోయారు. ఒకే ఒక్క రోజులో కోటి మంది కి పైగా తమ నెంబర్లను మార్చుకున్నారు. మరో వైపు దేశమంతటా డిజిటల్ టెక్నాలజీ ని అనుసంధానం చేసేందుకే ఈ నిర్ణయం తీసు కోవడం జరిగిందని ముకేశ్ అంబాని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెలలో నే కొత్త ప్లాన్ అమలు చేయనున్నట్లు షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా మార్కెట్ లో ఆర్ ఐ ఎల్ షేర్ వాల్యూ పెరిగింది.

మదుపుదారులకు భారీ ఎత్తున లాభాలు వచ్చేలా చేసింది. అయితే ఇప్పటి వరకు తమ సంస్థకు ఉన్న అప్పులను ఈ ఏడాది ఆఖరు లోపు పూర్తిగా తీర్చి వేస్తామని ముకేశ్ వెల్లడించారు. నిరర్ధక ఆస్తులను అమ్మడమో లేదా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన సెల్ టవర్స్ ను అమ్మడమో లేదా లీజ్ కు ఇవ్వడం ద్వారా అప్పులు తీరుస్తామని ప్రకటించారు. ఇక జియో నుండి కస్టమర్లు వెళ్లి పోకుండా ఉండేందుకు అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన ఎయిర్ టెల్ కంపెనీ తాను కూడా జియో బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ ఎక్స్ టీమ్ పేరుతో కొత్త డివైజ్ ను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ ఫైర్ స్టిక్ లాగా ఇది పని చేస్తుంది. కొన్ని టారిఫ్ లు కూడా ప్రకటించనుంది. మొత్తం మీద టెలికాం దిగ్గజ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు ఎంతో కొంత లాభం కలగనుంది అన్నమాట.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *