Type to search

ప్రగతిభవన్‌ ముట్టడి ఎఫెక్ట్‌:ఏసీపీ బదిలీ

News Politics Trenging News

ప్రగతిభవన్‌ ముట్టడి ఎఫెక్ట్‌:ఏసీపీ బదిలీ

💥💥💥💥

కాంగ్రెస్‌ పార్టీ ప్రగతిభవన్‌ ముట్టడి సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయన్ను ఆదేశించిది.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నర్సింహారెడ్డిని బదిలీ చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. ముట్టడి జరిగిన రోజు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంత భద్రత మధ్య కూడా కాంగ్రెస్‌ నేతలు ముట్టడించేందుకు వెళ్లడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రగతిభవన్‌ ప్రధాన గేటు వద్ద భద్రతాచర్యలు పర్యవేక్షించిన ఏసీపీ నరసింహారెడ్డిపై అదేరోజు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సందర్భంగా అక్కడ విధులు నిర్వహించిన బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావుతో పాటు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డిపైనా సీపీ అంజనీకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డెంగ్యూ నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
💥💥💥💥💥

డెంగ్యూ నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేసింది. గురువారం కోర్టుకు హాజరుకావాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది. డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పించలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించలేదని హైకోర్టు అసహనం తెలిపింది. సీఎస్‌, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌శాఖల, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *