Type to search

సమంత, శర్వానంద్ సినిమా ఎప్పుడంటే…

Box Office News Trenging News

సమంత, శర్వానంద్ సినిమా ఎప్పుడంటే…

Samantha akkineni, sharwanand, Samantha sharwanand, Samantha akkineni sharwanand, 96, 96 movie, 96 movie remake, 96 remake in telugu, Samantha akkineni sharwanand 96 remake, 96 remake release date, 96 remake release in Februaryతమిళంలో హిట్‌ సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తానంటున్నారు శర్వానంద్‌. తమిళం లో దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ రిమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రిమేక్ లో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత వంతు షూటింగ్ పూర్తయ్యింది. .. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో రూపొందుతున్న సినిమా కాబట్టి బహుశా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు స్టోరీ కనక్ట్ అవడం కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు బాలాయ మిత్రులు బడి వదిలిన 20 ఏళ్ల తరువాత రి-యూనియన్ లో కలుస్తారు. ఆ తరువాత కథ కోసం సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. తమిళ్ వర్షన్ కి సంగీత దర్శకత్వం వహించిన గోవింద్ వసంత సమకూర్చారు. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి లిరిక్స్ సమకూర్చారు. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు. షూటింగ్ పూర్తయిన తరువాత పేరు నిర్ణయిస్తారని సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *