Type to search

400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తా:సోనూ సూద్

Box Office Latest News Trenging News

400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తా:సోనూ సూద్

దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. ఆదుకునేందుకు మేమున్నాం అంటూ సినీ సెలబ్రిటీలు పెద్దఎత్తున ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముఖ్యంగా సోనూసూద్ వలస కార్మికులకు అండగా నిలబడి ప్రజలచేత ప్రశంశలు  అందుకున్నాడు . సొంత వాహనాలు పెట్టి సుమారు 30,000 పైగా వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చారు సోనూసూద్. ఇప్పటికీ ఆయన తన సర్వీస్‌ను కొనసాగిస్తూనే ఉండటం విశేషం. తమ స్వస్థలాలకు చేరుకునే సమయంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులను ఇప్పటికే ఈ విషయమై సంప్రదించారు సోనూ సూద్.. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు.సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *