Type to search

అల్లరి నరేష్ ‘నాంది’’ సినిమా టీజర్ రిలీజ్!

Box Office Latest News Trenging News

అల్లరి నరేష్ ‘నాంది’’ సినిమా టీజర్ రిలీజ్!

ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న అల్లరి నరేష్ చడీ చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసుకున్నాడు. తన 57వ చిత్రంగా ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో తనంటే నిరూపించుకున్న అల్లరి నరేష్.. మరోసారి ఓ ఇంట్రస్టింగ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. నరేష్ హీరోగా.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ 30న నరేశ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అంటే చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అల్లరి నరేష్ మళ్లీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ‘నాంది’ చిత్రంతో రాబోతున్నాడు.  నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నాంది’ సినిమా నుంచి ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ అయింది. దీన్ని యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *