Type to search

హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ !

Box Office Latest News Trenging News

హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ !

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ రోజు 41 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాంతో సినీ సెలబ్రెటీలు చాల మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపితున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేవికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన ప్రతి ఆడియో రిలీజ్ లో మహేష్ తనకు దేవి అంటే ఎంత ఇష్టమో చెప్పుతాడు. ఇక ఈ రోజు తన ట్విట్టర్ లో ”హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్. నీ అసాధారణ సంగీతంతో చార్ట్‌లను పాలించు. ఈ రోజు మీకు మంచి కలుగుతుంది. స్టే సేఫ్”అని ట్వీట్ చేశారు. బన్నీ ”నా స్నేహితుడికి మరియు సంగీత దర్శకునికి జన్మదిన శుభాకాంక్షలు. నా కెరీర్‌లో ఎక్కువ సినిమాలకు నువ్వే సంగీతం అందించావు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేవి శ్రీ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *