Type to search

హీరో శ్రీకాంత్ తండ్రి కన్నుమూత

Box Office Latest News Trenging News

హీరో శ్రీకాంత్ తండ్రి కన్నుమూత

ప్రముఖ తెలుగు హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటలకు కన్నుమూశారు. . పరమేశ్వరరావు గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు .

పరమేశ్వరరావు 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకా వారి పాలెంలో జన్మించారు. ఆయన కుటుంబం తర్వాత క్రమంలో కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఇక శ్రీకాంత్ తండ్రి మృతి కి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *