Type to search

హాలీవుడ్ లోకి ఆలీ ఎంట్రీ

Box Office Latest News Trenging News

హాలీవుడ్ లోకి ఆలీ ఎంట్రీ

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై ఒకేసారి రెండు బయోపిక్ లకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో పింక్ జగ్వార్స్ నిర్మిస్తున్న కలాం బయోపిక్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా ఇటీవలే విడుదల చేశారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కలాం బయోపిక్ కి భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ పోస్టర్ లాంచ్ లో ప్రామిస్ చేశారు. ఈ చిత్రంలో తెలుగు హస్యనటుడుఆలీ .. కలాం పాత్రదారిగా నటిస్తున్నారు. అబ్దుల్ కలాం బయోపిక్ తో హాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు ఆలీ .
కలాం బయోపిక్ తీసే హక్కు తమకు మాత్రమే ఉందంటూ ప్రముఖ నిర్మాత, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ వ్యతిరేకించడం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కలాం బయోపిక్ రైట్స్ తమకు మాత్రమే చెందుతాయని .. ఆ మహనీయుని జీవితంపై ఏ భాషలోనైనా సినిమా లేదా డాక్యుమెంటరీని నిర్మించే హక్కు తమకు మాత్రమే ఉందని అభిషేక్ వాదిస్తున్నారు. త్వరలోనే కలాం బయోపిక్ వివరాల్ని వెల్లడిస్తామని ఆయన మీడియాకి వెల్లడించడం తో కలాం బయోపిక్ విషయం వివాదాస్పదం అవుతోంది.

ప్రముఖ హాస్య నటుడు ఆలీ ప్రధాన పాత్రలో పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో జగదీష్ దానేటి దర్శకత్వంలో అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కుతోంది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *