Type to search

సోషల్ మీడియా లోకి మెగాస్టార్ చిరంజీవి!

Box Office Latest News Trenging News

సోషల్ మీడియా లోకి మెగాస్టార్ చిరంజీవి!

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటి వరకు తన అభిప్రాయాలను, అనుభవాలను, మెసేజ్‌లను వీడియో రూపంలో లేదా స్టేట్‌మెంట్ రూపంలో రిలీజ్ చేస్తూ వచ్చేవారు చిరు.. అయితే, తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు చిరంజీవి.
ఇక, నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను… దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి.. అలాగే, నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు కానీ, చెప్పాలనుకునే విషయాలను కానీ.. ప్రజలతో చెప్పుకోవడానికి వేదికగా భావిస్తూ.. అందేకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను.. అది కూడా ఈ ఉగాది నుంచే అంటూ.. వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి.
మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. అయితే, సోషల్ మీడియాలో చిరు ఎంత యాక్టివే గా ఉంటారు, ఏ ఏ ఖాతాలు తెరుస్తారు అనేది వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *