Type to search

సినిమా థియేట‌ర్స్ లో మందు ఇవ్వండి జనాలు వస్తారు : నాగ్ అశ్విన్.

Box Office Latest News Trenging News

సినిమా థియేట‌ర్స్ లో మందు ఇవ్వండి జనాలు వస్తారు : నాగ్ అశ్విన్.

 

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’, ‘మ‌హాన‌టి’… వంటి రెండు హిట్ సినిమాల‌తో పరిశ్రమ లో మంచి పేరు తెచ్చుకున్నాడు యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు ఈ యవ క్రేజీ దర్శకుడు . అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో రిలీజ్ కాని సినిమాల‌న్నీ ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో థియేట‌ర్స్ భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ క్రేజీ థాట్ తో ముందుకు వచ్చాడు నాగ్ అశ్విన్. విదేశాల్లోలాగా..మ‌న ద‌గ్గ‌ర కూడా థియేట‌ర్స్ కి బీర్, బ్రీజ‌ర్, వైన్ లాంటివి స‌ప్లై చేసే విధంగా లైసెన్స్ ఇస్తే…జ‌నాన్ని థియేట‌ర్స్ కు తీసుకురావొచ్చేమో అంటూ త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. ఇదే విష‌యాన్ని గ‌తంలో నిర్మాత సురేష్ బాబు, హీరో రానా వ‌ద్ద కూడా ప్ర‌స్తావించినట్టు తెలిపాడు. ఈ సూచ‌న మంచిదో, కాదో తెలిపాలంటూ నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు నాగ్ అశ్విన్. మరి ఈ ఐడియా ను మందు బాబులైతే మాత్రం మంచి ఐడియా అంటున్నారు కానీ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *