Type to search

సత్తా చూపలేని డిస్కో రాజా

Box Office Movie Reviews

సత్తా చూపలేని డిస్కో రాజా

నటీనటులు: రవితేజ – పాయల్ రాజ్ పుత్ – నభా నటేష్

తన్య హోప్ – బాబీ సింహా – వెన్నెల కిషోర్ – సునీల్ – గిరిబాబు – నరేష్ – సత్య – జీవా తదితరులు
సంగీతం: థమన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: రామ్ తాళ్లూరి
రచన – దర్శకత్వం: వీఐ ఆనంద్

మూస మాస్ కథలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న మాస్ రాజా రవితేజ.. విభిన్నమైన సినిమాలకు పేరుబడ్డ వీఐ ఆనంద్ తో కలిసి చేసిన ప్రయత్నం ‘డిస్కో రాజా’. స్టైలిష్ టీజర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మాస్ రాజా ఫ్లాప్ స్ట్రీక్ కు ఈ సినిమా తెరదించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

ఫ్లాష్ బ్యాక్ లో డిస్కో రాజా(రవి తేజ) పై లఢఖ్ లో ఓ గ్యాంగ్ దాడి చేసి అతనిని కిరాతకంగా చంపేస్తుంది. కొన్నేళ్లు పోయాక కొందరు యువకులతో కూడిన ఓ బృందం లఢఖ్ లో పర్వతారోహణకు వెళ్తే అక్కడ చాలా ఏళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం దొరుకుతుంది. దాన్ని ఓ శాస్త్రవేత్తల బృందం తమ చేతికి తీసుకుని.. చనిపోయిన వ్యక్తులకు ప్రాణం పోసే ఓ ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది. అనేక ప్రయత్నాల తర్వాత ఆ మనిషికి ప్రాణం పోయగలుగుతుంది ఈ బృందం. ఐతే ఆ వ్యక్తికి తానెవరో.. ఎలా చనిపోయానో.. తననెవరు చంపారో ఏమీ గుర్తుండదు. ఈ స్థితిలో అతడికి మళ్లీ అన్నీ ఎలా గుర్తుకొచ్చాయి.. అతడి గతమేంటి.. తనను చంపిన వాళ్లెవరో తెలుసుకుని అతనెలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం:

మాస్ మహారాజా రవి తేజ మార్కు సినిమా ఇది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఆనంద్ నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ కథ కొత్తగా ఉంది. అయితే కథనం లో ఆ ఆసక్తిని నిలబెట్టలేకపోయాడు దర్శకుడు. 35 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోస్తే అతను మళ్లీ ఈ లోకంలోకి వచ్చి స్పందించే వైనం ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుడిలో ఉంటుంది.. ప్రేక్షకులకు ఆ అనుభూతిని ఇవ్వడంలో ‘డిస్కో రాజా’ విఫలమైంది.

‘డిస్కో రాజా’ ఆరంభమైన తీరు చూస్తే ఒక ఎగ్జైటింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చూడబోతున్న అనుభూతికి లోనవుతాం. అసలే కొత్త కథ.. పైగా హీరో రవితేజ! రవితేజ సినిమా అంటేనే వినోదానికి ఢోకా ఉండదు అని తెలుగు ప్రేక్షకులు భావిస్తారు. మూడున్నర దశాబ్దాల పాటు ఈ లోకానికి దూరంగా ఉండి.. ఉన్నట్లుండి ఈ ప్రపంచంలోకి వచ్చే వ్యక్తి పాత్రతో ఆసక్తికర ఎపిసోడ్లు తో కథ ముందుకునడుస్తుంది. డిస్కో రాజాకు తానెవరో గుర్తుకొచ్చి విలన్ గ్యాంగ్ తో పోరాడే సన్నివేశాలతో ఇంటర్వెల్ ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ప్రథమార్ధం వరకు ‘డిస్కో రాజా’ ఓకే అనిపిస్తుంది. రవి తేజ యాక్షన్, వెన్నెల కిశోర్ కామెడీ ఈ రెండూ సినిమాకు ప్లస్ పాయింట్లగా నిలిచాయి.

ద్వితీయార్ధం కు వచ్చేసరికి కథనం పెద్ద బలహీనతగా మారింది.డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్లు, దొంగతనాలు, గ్యాఙ్గ్స్తర్ గా ఎదిగిన దృశ్యాలు తో సినిమాను రొటీన్ గా మార్చేశారు దర్శకుడు. రొటీన్ రివెంజ్ డ్రామా తరహాలో నడుస్తుంది. 80ల నేపథ్యంలో రెట్రో స్టయిల్లో సాగే ఫ్లాష్ బ్యాక్ వెరైటీగా వుండి వినోదాన్ని పంచింది. తనపై ఆధిపత్యం చలాయించిన విలన్ మీద డిస్కో రాజా కౌంటర్ ఎటాక్ చేసే ఎపిసోడ్ సినిమాలో ‘బెస్ట్’గా చెప్పొచ్చు. ఇక్కడ హీరో రవితేజ నటన మాస్ ను అలరిస్తుంది.. సినిమా ఆరంభమైనపుడు ఉన్న ఇంటెన్సిటీ.. క్యూరియాసిటీ సినిమా ముగిసే సమయానికి ఉండవు. ఓవరాల్ గా చెప్పాలంటే.. స్టోరీ లైన్ వరకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించినా.. దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం ‘డిస్కో రాజా’ను సాధారణమైన సినిమాగా నిలబెట్టిందని చెప్పొచ్చు.

నటీనటులు:

ఏడాదికి పైగా గ్యాప్ తరువాత రవితేజ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. డిస్కో రాజాగా ఫ్లాష్ బ్యాక్ లో మాస్ రాజా తన ఎనర్జీతో దుమ్ము దులిపేశాడు. డాన్స్ లు కూడా చెప్పుకోదగినట్టుగానే ఉన్నాయి. ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గత సినిమాలతో పోలిస్తే ఇందులోకొంచం మంచి నిడివి ఉన్న పాత్ర దొరికిందనే చెప్పుకోవాలి. నభా నటేష్ తక్కువ నిడివి ఉన్న పాటర్ అయినా తన అభినయం తో మెప్పించింది.. తన్య హోప్ కూడా కొద్దిసేపఏ కనిపించినా ఆమే నటన ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో బాబీ సింహా నటన ఆ పాత్రకు న్యాయం చేసింది. సునీల్ ఆంటోని దాస్ పాత్రలో కొత్తగా కనిపించాడు అతనికి తగిన మంచి పాత్ర ఇది.. సత్య నరేష్ సత్యం రాజేష్ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:

సినిమాలో అతి పెద్ద ఆకర్షణ అంటే తమన్ సంగీతమే. ఫ్రీకౌట్ సాంగ్ తో పాటు ‘నువ్ నాతో ఏమన్నావో’ పాట కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం లో కూడా తమన్ తన మార్కు చూపించడంలో సఫలీకృతుడయ్యాడు, నేపధ్య సంగీతం సినిమా అంతటా బాగుంది. తమన్ సంగీతానికి కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం కూడా తొడవ్వడంతో ప్రతి దృశ్యం అధ్బుతంగా వచ్చింది. నిర్మాత రామ్ తాళ్లూరి ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా సినిమాను నిర్మించాడు. దర్శకుడు వీఐ ఆనంద్ మంచి కథను ఎంచుకున్నా.. సాధారణమైన కథనంతో ‘డిస్కో రాజా’ ను అనుకున్న స్థాయికి  తీసుకు వెళ్లలేకపోయాడు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *