Type to search

బుట్ట బొమ్మను కలవాలని అయిదు రోజులు ఫుట్ పాత్ పై

Box Office Latest News Trenging News

బుట్ట బొమ్మను కలవాలని అయిదు రోజులు ఫుట్ పాత్ పై

పూజా హెగ్డే ఇప్పడు టాప్ హీరోయిన్ గా వెలుగుతోంది. డీజే సినిమా తరువాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో ఇలా అన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా ప్రభాస్ తో జాన్ లో చేస్తోంది . అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ రేంజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ బుట్ట బొమ్మ కు ఫ్యాన్స్ బాగా పెరిగారు

భాస్కర్ రావు అనే తెలుగు అబ్బాయి పూజా హెగ్డేకు వీరాభిమాని. డీజే మూవీ తో ఆమెకు పెద్ద ఫ్యాన్ అయ్యాడు . ఎప్పటినుండో ఆమెను కలవలనుకున్నాడు అయితే, పూజ ముంబైలో ఉందని తెలుసుకున్న అభిమాని అక్కడికి వెళ్ళాడు. కానీ ఆమెను కలిసే అవకాశం రాలేదు . ఎలాగైనా కలవాలని పట్టుదల తో పూజా ఉండే ఇంటి బయట ఐదురోజులుగా కాపలా కోశాడు. అక్కడే ఫుట్ పాత్ మీదనే పడుకున్నాడట. ఎట్టకేలకు తన అభిమాన హీరోయిన్ పూజా హెగ్డేను కలుసుకున్నాడు. చాలా సంతోషంగా ఉందని పూజా హెగ్డేతో అభిమాని తెలిపాడు. ఐదు రోజులుగా ఫుట్ పాత్ మీదనే ఉన్నట్టుగా చెప్పడంతో పూజా కరిగిపోయింది. అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది పూజా. మరి అభిమానులంటే పూజా కు కూడా అభిమానమే మరి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *