Type to search

శ్రీకారం” లో శర్వానంద్ లుక్ అదిరింది

Box Office Latest News Trenging News

శ్రీకారం” లో శర్వానంద్ లుక్ అదిరింది

ఏక్షన్ క్రైమ్ చిత్రం “రణ రంగం” తరువాత శర్వానంద్ చేస్తోన్న చిత్రం “శ్రీకారం”. విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ఆరంభం నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకుని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో శర్వానంద్.
ఈ రోజు ‘శ్రీకారం’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో శర్వానంద్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. శర్వానంద్ ఒక పల్లెటూరి కుర్రాడి లా లుంగీ కట్టుకుని, పసుపు రంగు షర్ట్ దానికి తోడు బుజాన టవల్ వేసుకుని పొలం గట్టున నడుస్తున్నట్లు ఉన్న ఈ ఫస్ట్ లుక్ కు అప్పుడే మంచి రివ్యూస్ వస్తున్నాయి. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు ఫస్ట్ లుక్ చూస్తుంటేనే సినిమాను చూడాలన్నంత ఆసక్తి కలుగుతుందంటూ శర్వా అభిమానులుతమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో శర్వానంద్ డి యువ రైతు పాత్ర అని తెలుస్తోంది.

త్వరలో ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వా. తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్చేసిన విషయం తెలిసినదే. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను తెలుగులో శర్వానంద్ చేస్తున్నాడు.

కిషోర్ బి దర్శకత్వంలో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట మరియు గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు. మే లేదా జూన్ ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. ఇది శర్వానంద్ నటిస్తోన్న 29వ చిత్రం. ఈ చిత్రానికి సంగీతం మికి జే మేయర్ అందిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *