Type to search

శివాత్మిక ‘విధి విలాసం’ ప్రారంభం

Box Office Latest News Trenging News

శివాత్మిక ‘విధి విలాసం’ ప్రారంభం

“దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవితల చిన్నకూతురు శివాత్మిక . తొలి సినిమాతో పూర్వకాలలోని ఉన్నతవర్గానికి చెందిన యువతిగా నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా ఒక మంచి సినిమాగా నిలిచింది. ‘శివాత్మిక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆధునిక యువతిగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
యంగ్ హీరో అరుణ్ ఆదిత్(24 కిస్సెస్), శివాత్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ‘విధి విలాసం’. నూతన దర్శకుడు దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. కోట శ్రీనివాసరావు, పోసాని ,, ఇంద్రజ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *