Type to search

శివాజీ రాజా నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తోన్న టాలీవుడ్!

Box Office Latest News Trenging News

శివాజీ రాజా నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తోన్న టాలీవుడ్!

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల 31 వరకు వైద్యము, అత్యవసర సేవలు, నిత్యవసర వస్తువులు సరఫరా మొదలగు వాటిని మినహాయించి అన్ని రకాల వ్యాపార వాణిజ్య సేవలను నిలిపి వేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలందరూ స్టే ఎట్ హోం లేదా హోం ఇసోలేషన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
తాజాగా స్టే హోమ్ అనేది ఒక ఛాలెంజ్ గా సోషల్ మీడియా లో స్టార్ట్ చేశారు. ఈ స్టే హోమ్ ఛాలెంజ్ శివాజీ రాజా స్వీకరించారు. .. ఈ విరామ సమయాన్ని తన ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయడం కోసం కేటాయించారు. అక్కడ పండించిన పంటలను చుట్టుపక్కల వాళ్లకు పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. “మా” అసోసియేషన్ సభ్యులకు సహాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తానన్నారు.
ఇక ఈ స్టే హోమ్ ఛాలెంజ్ కోసం మరో ఐదుగురిని నామినేట్ చేశారు శివాజీ రాజా. ఆ లిస్టులో కమెడియన్ అలీ, హీరో శ్రీకాంత్, సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, నటుడు ఉత్తేజ్‌ ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీ తరుపున ఇప్పటికే ఎంతోమంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ దగ్గర పనిచేసే సిబ్బంది తో పాటు తమను నమ్ముకుని ఉన్న ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనలను కాపాడటానికి మరియు ఈ కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ప్రబలకుండా ఉండటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసు శాఖ వారికి, ప్రభుత్వ అధికారులకు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ… వారి సూచనమేరకు ప్రజలందరూ కొంతకాలం పాటు స్వీయ నిర్భంధంలో ఇంటి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *