Type to search

శివగామి పోలిటికల్ ఎంట్రీ!

Box Office Latest News Trenging News

శివగామి పోలిటికల్ ఎంట్రీ!

నా మాటే శాసనం అంటూ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో రాజమాత శివగామీదేవి పాత్రలో జీవించారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఎంతో మంది సినీ తారలు పొలిటీషియన్‌గా మారడం చూశాం. ఇప్పుడు రమ్యా కృష్ణ కూడా అదే బాటలోకి కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో సినిమాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రమ్యకృష్ణ. యంగ్ ఏజ్‌లో ఉండగానే అందరు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ కొట్టేసిన ఈమె.. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. అప్పట్లో రమ్యకృష్ణ అందాలు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి టాలీవుడ్ లోకం ఊగిపోయింది.

ఇక ఈ మధ్యకాలంలో పవర్‌ఫుల్ రోల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తోంది. దక్షిణాదిలో పవర్‌ఫుల్ యాక్ట్రెస్‌ ఎవరంటే ఠకీమని రమ్యకృష్ణ అని చెప్పుకునే రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఈ తరహా పాత్రలకు మళ్లీ డిమాండ్ వచ్చి.. రమ్యకృష్ణకు అవకాశాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు సూపర్ క్రేజ్ దక్కింది. తెలుగులో చివరగా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో పవర్‌ఫుల్ లేడీగా, అత్తగా రమ్యకృష్ణ కనిపించింది. ఇక ఇప్పుడు పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా అలరించేందుకు రెడీ అవుతోంది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దవకట్టా దర్శకత్వంలో పక్క పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రోల్ కీలకంగా ఉండనుందట. స్క్రిప్ట్ ప్రకారం ఆమె పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్రలో రమ్యకృష్ణ నట విశ్వరూపం చూడనున్నామని టాక్.
సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో 14వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *