Type to search

రోజు వారి ఆదాయం పై గడిపే వారికి చేయూతనివ్వండి… కాజల్

Box Office Latest News Trenging News

రోజు వారి ఆదాయం పై గడిపే వారికి చేయూతనివ్వండి… కాజల్

 

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తం గా ప్రజలను ఎంతగా వణికిస్తోందో తెలిసిన విషయమే. ఎంతో మంది కి కరోనా కారణం గా పనులు లేవు. ఇదే విషయంలో టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ కాజల్ ఎమోషనల్ అయ్యింది .సోషల్ మీడియాలో వచ్చిన ఓ కథనానికి ఈ అందాల భామ కరిగిపోయింది అసలే సున్నిత మనస్కురాలైన కాజల్ సోషల్ మీడియా లో వచ్చిన ఒక పోస్ట్ చూసి కనులు నీరు నింపుకుంది. తాజాగా కరోనా వలన ఓ క్యాబ్‌ డ్రైవర్ పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయింది.”ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని కన్నీరు పెట్టుకున్నారు. 48 గంటల్లో ఆయనకు నేనే మొదటి కస్టమర్‌నట. ఈ రోజైనా నిత్యావసర సరకులు వస్తాయని ఇంటి దగ్గర అతడి భార్య ఎదురుచూస్తోందట. ఈ వైరస్ చాలా విధాలుగా మనకు సోకచ్చు. కానీ రోజు వారీ జీవితం మీద ఆధారపడిన వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. తన చివరి కస్టమర్‌ను వదిలిన తరువాత ఆ డ్రైవర్ 70కి.మీలు తిరిగినట్లు నాకు చూపించాడు.రోజువారి ఆదాయం మీద గడిపేవాళ్ళని వైరస్‌ చాలా దెబ్బ తీస్తుంది. అతని సమస్యలు విని రూ.500 ఎక్కువగా ఇచ్చాను. ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు.  ఆ రోజు మీరే వారి చివరి కస్టమర్ కావొచ్చు .. అని అతడు పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ ను కాజల్ ఫార్వార్డ్ చేసింది. ఈ సంఘటన నన్ను ఎంతో ఎమోషనల్ అయ్యేలా చేసింది అని కాజల్ పేర్కొంది. ఈ పోస్ట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కచ్చితంగా మా వంతు సహాయం చేస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *