Type to search

రోజుకు ఒక పూట మాత్రమే తినాలి :నందిని రెడ్డి

Box Office Latest News Trenging News

రోజుకు ఒక పూట మాత్రమే తినాలి :నందిని రెడ్డి

 

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు పెద్ద సంఖ్యలో స్పందన వచ్చింది. సినీ సెలబ్రిటీలు సైతం … మోదీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించింది. తెలుగు, హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా చప్పట్లు కొట్టి జనతా కర్ఫ్యూను విజయవంతంగా పాటించారు.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకురాలిగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు నందిని రెడ్డి.
ఆమే ఇవాళ ఓ ట్వీట్ చేశారు. లాక్ డౌన్‌, కరోనా వైరస్ నడుస్తున్న సందర్భంగా ఆమె నెటిజన్లకు ఓ సలహా ఇచ్చారు. ఇలాంటి సమయంలో బతకాలంటే నేను పాటించిన మంత్రం ఇదే అన్నారు. రోజుకు ఒక పూట మాత్రమే తినాలన్నారు. దీని వల్ల ఇంట్లో సరుకులు అయిపోకుండా ఎక్కువరోజులు ఉంటాయన్నారు. అంతేకాకుండా మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రస్తుతం ఆమే వైజయంతీ మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఒక సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కథానాయకుడిగా నాగశౌర్యను తీసుకున్నారు. గతంలో నందినిరెడ్డిశౌర్య తో కలిసి కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాల్లో నటించాడు . ఇక ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *