Type to search

రైడ్ విత్ సుశాంత్’…’ఇచట వాహనములు నిలుపరాదు’

Box Office Latest News Trenging News

రైడ్ విత్ సుశాంత్’…’ఇచట వాహనములు నిలుపరాదు’

త్వరలో యంగ్ హీరో సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో దర్శన్ అనే నూతన దర్శకుడు తెలుగు ఇండస్ట్రి కి పరిచయమవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇచట వాహనములు నిలుపరాదు’అనే టైటిల్ పెట్టడం ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.  సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన చిన్న వీడియోను విడుదల చేసారు చిత్రయూనిట్. .. ‘రైడ్ విత్ సుశాంత్’ పేరుతో టీజర్ లాంటి వీడియా ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కొత్తగా కొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను నడుపుకుంటూ వచ్చి నోపార్కింగ్ బోర్డు ముందు ఆపడం చూపించారు. సుశాంత్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ‘చిలసౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుశాంత్ . ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.ఈ సినిమా సుశాంత్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *