Type to search

‘రాహు’ మహిళల కోసం చేసిన చిత్రం

Box Office Latest News Trenging News

‘రాహు’ మహిళల కోసం చేసిన చిత్రం

 

కన్వర్షన్‌ డిజార్డర్‌తో బాధ పడే అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన ‘రాహు’తో ఎలా పోరాటం చేస్తుంది అనే ఇతి వృత్తం తో మన ముందుకు రాబోతున్న చిత్రం రాహు. సుబ్బు వేదుల దర్శకత్వంలో అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
‘‘మను’ సినిమాలో నా నటన నచ్చి దర్శకుడు సుబ్బుగారు ఆడిషన్స్ కి పిలిచారు. సుబ్బు కూడా సినిమా మీద ఫ్యాషన్‌తో నాలాగే అమెరికా నుండి ఇండస్ట్రీకి వచ్చారు. ‘రాహు’ సినిమా చూస్తే కొత్త దర్శకుడు తీసినట్టు అనిపించదు.. అంత బాగా తీశాడు’’ అని అభిరామ్‌ వర్మ అన్నారు. ఈ సందర్భంగా అభిరామ్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఫిలిమ్స్‌లో మాస్టర్స్‌ చేశాను. ‘మిస్టర్‌ ఆంధ్ర’గా సెలెక్ట్‌ అయ్యాను.. ‘మిస్టర్‌ ఇండియా’ ప్రయత్నాల్లో ఉండగా దర్శకుడు తేజ గారి నుండి ‘హోరా హోరీ’ కోసం కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ‘మను’, ఇప్పుడు ‘రాహు’ చేశా. సినిమాలో లవర్‌ బాయ్‌లా మొదలైన నా పాత్ర యాక్షన్‌కి టర్న్‌ అవుతుంది. ఇది మహిళల కోసం తీసిన చిత్రం. కృతి పాత్రలో చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా మంది అనుకున్నట్లు ఇది జాతకాల సినిమా కాదు.. ‘రాహు’ టైటిల్‌ బాగా సరిపోతుందని పెట్టాం. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు.
ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్‌, చలాకీ చంటి, గిరిధర్‌, సత్యం రాజేష్‌, స్వప్నికలు ముఖ్యపాత్రలు పోషించారు. ఏ వి ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు బాణీలు సమకూర్చారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *