Type to search

రానా ,మిహీక ‌ల వివాహానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్ట్‌!

Box Office Latest News Trenging News

రానా ,మిహీక ‌ల వివాహానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్ట్‌!

రానా దగ్గుబాటి మిహీక బజాజ్‌ల  వివాహానికి ఏర్పాట్లు ప్రత్యేక నిబంధనల ప్రకారం సాఫీగా సాగుతున్నాయి. కోవిడ్ నియమ నిబంధనల వల్ల ఈ వివాహం కూడా ఇతర సెలబ్రిటీ వెడ్డింగ్స్ తరహాలోనే సింపుల్ గా కుటుంబీకులు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది. ఆగస్టు 8 ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ”వివాహ వేడుకకు వచ్చే వారి సంఖ్య 30 కూడా దాటదు. చాలా కొద్దిమంది అతిథులు మాత్రమే దీనికి హాజరవుతారు. మా బంధువులు, చిత్ర పరిశ్రమలోని వారిని కూడా ఈ వివాహానికి పిలవడం లేదు. అందుకు కారణం కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటమే” అని సురేష్ బాబు పేర్కొన్నారు. ఇప్పటికే రోకా వేడుక పూర్తయింది. మెహందీ.. సంగీత్.. బ్యాచిలర్ పార్టీ ఇలా వేడుకలతో రానా- మిహీక జంట బిజీగా ఉన్నారట. అది తమకు చాలా ప్రత్యేకమైన రోజని అందుకే భద్రత విషయం అస్సలు రాజీపడమని మిహిక తల్లి బంటి బజాజ్‌ తెలిపారు.ఇక వివాహానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుక ప్రాంతంలో వీలైనన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు, భౌతికదూరం పాటించేలా చూస్తామన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *