Type to search

రాంగోపాల్ వర్మ కరోనావైరస్‌ పై ట్వీట్లు

Box Office Latest News Trenging News

రాంగోపాల్ వర్మ కరోనావైరస్‌ పై ట్వీట్లు

కాదేదీ ట్వీట్లకు అనర్హం అన్నట్లు ఉన్న ఆర్ జి వి
కరోనా వైరస్ ఈ మాట వింటేనే ప్రపంచదేశాలు ఉలిక్కి పడ్తున్నాయి. బీద గొప్ప దేశం అని భేదం లేకుండా ఈ మహమ్మారి భూగోళం పై ఉన్న మానవులందరిని భయ బ్రాంతులకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన కోరోనావైరస్‌ను ఉపయోగించుకొని దేవుడిపై, మతాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధిస్తున్నారు. సందర్భం ఏదైనా తన ట్వీట్లతో లైమ్ లైట్ లో ఉండడం లో ఆర్జీవి దిట్ట. ఇప్పుడు కరోనావైరస్‌పై ట్వీట్లు చేస్తూ ట్విట్టర్‌ను రఫ్ ఆడిస్తున్నారు. రాంగోపాల్ వర్మ చేసిన కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు ఇవే..
కరోనావైరస్‌ గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ.. భగవంతుడు, కరోనావైరస్ సీక్రెట్‌గా అఫైర్ పెట్టుకొన్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే.. వారి లవ్ స్టోరీలో మానవులు విలన్లు కాబట్టి. అందుకే కరోనావైరస్‌కు దేవుడు సపోర్ట్‌గా నిలిచాడనే విధంగా వర్మ కామెంట్ చేశారు.
ఇక మరో ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ మత పెద్దలను టార్గెట్ చేశారు. వైరస్‌లను దేవుడు ఎందుకు క్రియేట్ చేస్తారో ఏ మతపెద్దైనా వివరించగలరా? నాకు తెలిసిన జవాబు ఏమిటంటే.. పాపులను శిక్షించేందుకే దేవుడు వైరస్‌ను సృష్టించారు. మనమెందుకు పాపులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు ఆదేశాలకు వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తున్నట్టే కదా? అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కరోనాను ఏ మతం కూడా ఎదురించలేకపోయిందని రాంగోపాల్ వర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనల్ని ఏ మతం కూడా కాపాడలేని పరిస్థితి ఉన్నప్పుడు.. కరోనా అనే మతాన్ని మనం స్వాగతిస్తే సరిపోతుంది కదా అంటూ మరో ట్వీట్ చేశారు.
దేవుడు చేసిన మనుషులే ఆలయాలను, మసీదులను, చర్చిలను కట్టారు. మళ్లీ ఇప్పుడు వారే దేవుడు సృష్టించిన వైరస్ కారణంగా వాటిని మూసేస్తున్నాడు. ప్రార్థనలు చేసుకోవడానికి మనకంటే వైరస్‌లే ఎక్కువ చర్చిలు, ఆలయాలు, మసీదులు సృష్టిస్తాయని నా భావన అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పలువురు వీటిని షేర్ చేస్తూ వీటి గురించి చర్చించుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *