Type to search

రమ్యకృష్ణ 50వ పుట్టినరోజు!

Box Office Latest News Trenging News

రమ్యకృష్ణ 50వ పుట్టినరోజు!

అందాల తార, శివగామి రమ్యకృష్ణకి ఈరోజు చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే ఇవాళ రమ్యకృష్ణ తన 50వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రమ్యకృష్ణ పుట్టినరోజును జరుపుకోగా.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కంటే ఆనందం ఏముంటింది అని రమ్యకృష్ణ కామెంట్ పెట్టారు. ఇక ఆ ఫొటోలో రమ్యకృష్ణ భర్త, దర్శకుడు కృష్ణవంశీ, ఆమె కుమారుడు రిత్విక్ వంశీ ఉన్నారు. అయితే కాస్త సిగ్గరి అయిన రిత్విక్.. ఈ ఫొటోలో తన మొహం కనిపించకుండా చేతిని అడ్డు పెట్టుకున్నారు.

1983లో ‘వెల్లై మనసు’ అనే తమిళ చిత్రం ద్వారా రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెర మీదా పలు సీరియళ్లలో నటించారు. ఇక క్వీన్‌తో వెబ్‌ సిరీస్‌లోకి కూడా అడుగుపెట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *