Type to search

మ‌న‌సా..మ‌నసా..మ‌న‌సారా … పాట విడుదల

Box Office Latest News Trenging News

మ‌న‌సా..మ‌నసా..మ‌న‌సారా … పాట విడుదల

‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం లో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ నుంచి మొదటి పాటను విడుదల చేశారు చిత్రా బృందం. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.
‘‘మ‌న‌సా.. మ‌నసా.. మ‌న‌సారా బ్రతిమాలా త‌న‌వ‌లలో ప‌డ‌బోకే మ‌న‌సా’’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా బాగుంది అని టాక్ వచ్చింది.అయితే, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద‌ర‌బాద్ ప‌రిసర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హగ్డే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, హీరో అఖిల్ ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఆయన హీరోలా లాంచ్ అయ్యి సుమారుగా ఐదేళ్లు అవుతున్నా ఇంకా సరైన హిట్ దొరకలేదు. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *