Type to search

మెగా వారసుడిని ఢీ కొననున్న విజయసేతుపతి !

Trenging News

మెగా వారసుడిని ఢీ కొననున్న విజయసేతుపతి !

 

మెగాస్టార్ మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా వినూత్నంగా రూపొందిస్తున్నారు. సాధారణంగా కొత్త హీరోలకు ఎప్పుడూ ఒక సింపుల్ కమర్షియల్ లవ్ స్టోరీని ఎంచుకుంటారు. అయితే ఈసారి దీనికి భిన్నంగా ఇంటెన్స్ లవ్ స్టోరీని ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా కీలకమైనదని సమాచారం. హీరోయిన్ తండ్రి పాత్రలో సేతుపతి కనిపిస్తాడని తెలుస్తోంది. విజయ్ సేతుపతి నటన సంగతిచెప్పుకోవడానికి లేదు. హీరో హీరోయిన్లు కొత్తవారు కాబట్టి విజయ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని వారిని అలరిస్తాడని ఆశిస్తున్నారు.. ,మరి మెగా ఫ్యామిలి నుండి వస్తోన్న ఈ హీరోను ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. ఏప్రిల్ 2 న ‘ఉప్పెన’ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *