Type to search

మీడియాకు సమాచారం: జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీలోకి క‌న‌క‌రాజు సూరి

Andhra Latest News News Politics Trenging News

మీడియాకు సమాచారం: జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీలోకి క‌న‌క‌రాజు సూరి

మీడియాకు సమాచారం:

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీలోకి క‌న‌క‌రాజు సూరి
న‌ర‌సాపురం పార్ల‌మెంటు, దాని ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల‌కు ఇన్‌ఛార్జ్‌ల నియామ‌కం

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీలో భీమ‌వ‌రానికి చెందిన శ్రీ వేగేశ‌నం సూర్య‌నారాయ‌ణ‌రాజు(క‌న‌క‌రాజు సూరి)ని స‌భ్యునిగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు నియ‌మించారు. ప్ర‌స్తుతం ప్యాక్‌లో 11 మంది స‌భ్యులు ఉన్నారు. క‌న‌క‌రాజు సూరి చేరిక‌తో స‌భ్యుల సంఖ్య 12కి చేరింది. ఈ క‌మిటీని 18 మందితో విస్తృత ప‌రుస్థాన‌ని పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు సోమ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శ్రీ క‌న‌క‌రాజు సూరి 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్ధిగా భీమ‌వ‌రం నుంచి పోటీ చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఆయ‌న ద‌ళిత సూరిగా పేరుగాంచారు. ఈ నియామ‌కంతో పాటు న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల‌కు కూడా ఇన్‌ఛార్జ్‌ల‌ను ఖ‌రారు చేశారు. పార్ల‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా శ్రీ చేగొండి హ‌రిరామ‌జోగయ్య గారి త‌న‌యుడు శ్రీ చేగొండి సూర్య‌ప్ర‌కాష్‌ని నియ‌మించారు. తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీకి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌, పాల‌కొల్లు అసెంబ్లీకి శ్రీ గుణ్ణం నాగ‌బాబు, త‌ణుకు అసెంబ్లీ సెగ్మెంట్‌కి శ్రీ విడివాడ రామ‌చంద‌ర్‌రావు, భీమ‌వ‌రం స్థానానికి శ్రీ కొటిక‌ల‌పూడి గొవింద్‌(చిన‌బాబు), న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గానికి శ్రీ బొమ్మిడి నాయ‌క‌ర్‌, ఆచంట‌, ఉండి నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ల‌ను ప్ర‌స్థుతానికి శ్రీ చేగొండి సూర్య‌ప్ర‌కాష్‌, శ్రీ క‌న‌క‌రాజు సూరిల‌కు అప్ప‌గించారు. ఈ రోజు ఉద‌యం కార్య‌క‌ర్త‌ల స‌మావేశం అనంత‌రం సుధీర్ఘంగా చ‌ర్చించి ఈ నియామ‌కాల‌ను జ‌రిపారు.

– మీడియా విభాగం
జనసేన పార్టీ

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *