Type to search

మా పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్స్: నితిన్

Box Office Latest News Trenging News

మా పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్స్: నితిన్

 

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ .. ప్రియురాలు షాలిని కందుకూరిని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. వీరిది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం. షాలిని బ్రిటన్ లో ఎంబీఏ మాస్టర్స్ పూర్తి చేశారు.
నేడు హైదరాబాద్ లోని నితిన్ నివాసంలో ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. పెళ్లి పందిరిలో సందడి అంతా ఇప్పటికే ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల్లోవైరల్ అయ్యింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు .. కొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారని సమాచారం.

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 15 మొదలు పెళ్లి ఏర్పాట్లు జరగనున్నాయని నితిన్ తెలిపారు. ‘పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 16న దుబాయ్ లో పలాజో వర్సాచీ హోటల్ లో నితిన్- షాలిని జంట వివాహం జరగనుంది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *