Type to search

మార్చి 6న ‘పలాస 1978’

Box Office Latest News Trenging News

మార్చి 6న ‘పలాస 1978’

రక్షిత్, నక్షత్ర జంటగా నటించి తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం ‘పలాస 1978’. ఈ చిత్రంతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతోంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. ఈ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్దం అవుతోంది.
ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదలయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

సెన్సార్ సర్టిఫికెట్ పొందాక మీడియాతో మాట్లాడిన దర్శకుడు కరుణ కుమార్.. ”సెన్సార్ బోర్డ్ ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమీటీకి వెళ్ళాం. అక్కడ పలాస 1978 చూసిన బృందం ఈ సినిమాను ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు. తెలుగు సినిమాలలో ‘పలాస 1978’ భిన్నమైనదని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకు కథ నుండి రిలీజ్ వరకూ మాకు అండగా నిలుస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ గారికి చాలా థాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు. ఈ చిత్రం లో పాటల్;ఊ అన్నీ శ్రీకాకులం జిల్లాలోని జానపద గేయాలకు దగ్గరలో ఉన్నాయి. ఈ చిత్రానికి పాటలు భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మి భూపాల అందించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *