Type to search

మనకోసం అందరూ, అందరికోసం మనం-జనతా కర్ఫ్యూ

Box Office Latest News Trenging News

మనకోసం అందరూ, అందరికోసం మనం-జనతా కర్ఫ్యూ

మనకోసం అందరూ, అందరికోసం మనం..అదే సమాజం అంటే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ రాజ్యమేలుతోంది. దీని వల్ల వేల మంది మరణించగా.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. దీని వల్ల ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ చేయాలని చెబుతున్నారు. అసలు ఎందుకు ఇలా చేయాలి.. దీని వల్ల లాభాలు ఏంటి.. చూద్దాం..
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు మరియు ఇది కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది. 14 గంటల తర్వాత మనకు లభించేది సురక్షితమైన దేశం. కాబట్టి, అది వెనుక ఉన్న ఆలోచన. సమీప భవిష్యత్తులో ఎక్కువ సమయం అవసరమైతే ఇది ఒక ప్రాక్టీస్‌గా అవుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1, 2 గంటల్లోనే అందరూ ఈ వైరస్ వున్న స్థలాల్లో వుండడం తాకడం చేయడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. ఆ సమయంలో ఎవరు బయటికి రాకపోతే 12 గంటల తర్వాత దానంతట అదే కరోనా వైరస్ మరణిస్తుంది. 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే వుంటే ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందడాన్ని మనం ఆపగలం.

అందుకే ప్రజలతా ఆదివారం మార్చి 22, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లల్లోనే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లు వదిలి బయటికి వెళ్లాలంటే.. ఉదయం 7 గంటల ముందు.. రాత్రి 9 గంటల తర్వాత వెళ్లొచ్చు. కొన్ని దేశాల్లో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో సానిటైజర్స్‌ని వెదజల్లడం అన్ని ప్రదేశాలను వీటితో తుడువడం మనం చూస్తూనే వున్నాం. అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది మాత్రం తెలియదు. కానీ మనం ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా దానంతట అదే మరణించేట్టు చేయగలిగితే 100% నిర్మూలించగలం… అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేయొచ్చు. ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో వాడక్కర్లేదు, తుడవక్కర్లేదు… 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది. కనుక జనతా కర్ఫ్యు ను పాటించడం వలన మనందరికీ మేలు జరిగినట్టే ఆ సమయంలో మనం ఇంటి నుండి బయటకు పోకుండా ప్రభుత్వం వారు చెబుతున్న జాగ్రత్తలను తీసుకోవాలి

సామాజిక బాధ్యతతో, సమాజాన్ని పీడిస్తున్నకరోనా కోరల్ని సమాజంలో ఒకరిగా ఉంటూ, సమాజం కోసం స్వీయ క్రమ శిక్షణతో, స్వీయ పరిశుభ్రతతో,, సామాజిక బాధ్యతగా మనకోసం అందరినీ, అందరికోసం మనల్నీ కాపాడుకుందాం. జనతా కర్ఫ్వూ పాటిద్దాం…… కరోనా మహమ్మారిని అరికడదాం……

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *